అనామిక అన్వేషణ చూడొచ్చు

బాలీవుడ్ లో వచ్చిన కహానీ చిత్రం రీమేక్ అయిన అనామిక తెలుగులో విడుదలైంది.
దర్శకుడు శేఖర్ కమ్ముల రీమేక్ చేసిన ఈ చిత్రం ఆద్యంతం విసుగు పుట్టించకుండా చూడనిస్తుంది.
కనిపించకుండా పోయిన తన భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే ) ఆచూకికోసం అమెరికా నుంచి హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లోకి అడుగు పెడుతుంది అనామిక (నయనతార).
విమానాశ్రయం నుంచి ఆమె తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. అయితే పోలీస్ వారి నుంచి ఆశించినంత సహాయం లేకపోవడంతో ఆమె ఒక ఆఫీసర్ పార్థ సారధి (వైభవ్) ని ఆశ్రయిస్తుంది. అతను అనామిక భర్త ఆచూకికోసం రంగంలో దిగుతాడు.  అనేక మలుపులు తిరిగిన ఈ చిత్రం చూడదగ్గదే.
బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన కహాని చిత్రం కథను మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా టెంపో తగ్గకుండా రీమేక్ చేసిన చిత్రమిది. అయితే ఎక్కడా రీమేక్ లా అనిపించదు. దర్శకుడి స్క్రీన్ ప్లే పట్టుగా ఉంది రచయిత యండమూరి వీరేంద్రనాథ్ భిన్నమైన రీతిలో కథనాన్ని వివరించడం, అది రంజుగా తెరకెక్కిన విధానం చాలా బాగుంది. విద్య బాలన్ గర్భిణిగా నటిస్తే అనామికలో నయనతార  పూర్తి భిన్నమైన పాత్రలో నటించించింది. ఆమె నటన ఈ చిత్రానికి హైలైట్.
ఎం ఎం కీరవాణి సంగీతం అదిరిపోయింది.
ఇది సీరియస్ ఫిలిం అయినా ప్రస్తుత సమాజానికి అన్ని విధాలా అనువైన కథనంగా ఇది విజయవంతమవుతుంది అనడంలో సందేహం లేదు.
శేఖర్ కమ్ముల దర్శకత్వం అమోఘం.

Send a Comment

Your email address will not be published.