అనుష్కాకు గాయం?

నటి అనుష్కా షెట్టీ  గాయపడ్డారు.

రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించిన కథానాయిక అనుష్కా గాయపడినట్టు తెలిసింది. పేస్ బుక్ పేజీలో ఆమె ఫోటో ఒకటి పోస్ట్ చేసారు. ఆ ఫోటోలో మణికట్టుకి ఓ బ్యాండేజ్ కనిపించింది.

రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్ అనుష్కా నటనను అన్ని విధాలా పొగుడుతూ ముఖ్యంగా ఆమె అంకితభావం అమోఘమని అన్నారు. దర్శకుడు గుణశేఖర్ అనుష్కాకు అయిన గాయాన్ని ప్రస్తావించినా అది ఎలా ఎప్పుడు అయిందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. రుద్రమదేవి సినిమా అప్పుడా లేక బాహుబలి చిత్రం షూటింగ్ అప్పుడా ఆమె గాయపడ్డారా  అన్నది తెలియలేదు. ఈ రెండు సినిమాలలో అనుష్కా కత్తులతో కొట్లాడుకునే సన్నివేశాలలో ఎక్కువగా నటించారు.

అనుష్కా నటన అద్భుతమని, ఆమె ప్రతిభ రుద్రమదేవి చిత్రానికి ఓ ప్లస్ పాయింట్ అని గుణశేఖర్ చెప్పారు. యాక్షన్ సన్నివేశాలలో చురుగ్గా పాల్గొన్న అనుష్కా సెట్స్ లో అందరితోను ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ ఎక్కడా విసుగు చిరాకూ కనిపించనివ్వలేదని దర్శకుడు చెప్పారు. ఆమెకు తీవ్ర గాయమైనప్పటికీ ఆమె పెదవులపై చిరునవ్వు మాత్రం చెరగ నివ్వలేదని ఆయన అన్నారు. అది నటనపట్ల ఆమెకున్న అంకిత భావానికి చిహ్నమని గుణశేఖర్ అన్నారు.

ఈ రెండు సినిమాలే కాకుండా ఆమె రజనీకాంత్ తోపాటు లింగా సినిమాలోను నటించారు.

Send a Comment

Your email address will not be published.