అనుష్క ఖాతాలో నంది

Anushka Shettyఅనుష్క షెట్టి అవార్డులకు పెట్టిపుట్టింది. ఆమె సొంతం చేసుకున్న అవార్డులకూ, రివార్డులకూ లెక్కలేదు. ఆ అవార్డుల జాబితాలో తాజాగా ఇప్పుడు నంది అవార్డు కూడా చేరింది. ఆమె 2016లో నటించిన సైజ్ జీరో చిత్రంలో ఆమెకు ఉత్తమ నటిగా ఈ నంది పురస్కారం దక్కడం విశేషం.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సీనియర్ కథానాయికలలో అనుష్క ఒకరు. ఆమె ఈ పరిశ్రమకు వచ్చి దాదాపు 12 ఏళ్లు అవుతోంది. ఇప్పటికే అగ్ర్రశ్రేణి కథానాయకుల సరసన నటించిన అనుష్క తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంతరించుకుంది.

ఆమెకోసం ఓ మంచి కథ దొరికిందో నిర్మాతలు కానీ దర్శకులు కానీ వెంటనే అనుష్కతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనేది అతిశయోక్తి కాదు. ఆమె గ్లామర్ ఆమె నటనా ప్రతిభకు చక్కగా తోడవుతోంది.

ఆమె 1981 నవంబర్ ఏడవ తేదీన మంగళూరులో జన్మించారు. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. ఆమె తండ్రి పేరు ఏఏన్ విఠల్ ప్రభుల్లా శెట్టి. తల్లిప్రఫుల్లా శెట్టి. ఆమె ఎత్తు అయిదు అడుగుల పది అంగుళాలు. అంటే దాదాపు 178 సెంటీమీటర్లు. ఆమెకు ఇద్దరు సోదరులు. వారి పేర్లు – గుణరంజన్ శెట్టి (వ్యాపారి). సాయి రమేశ్ శెట్టి (డాక్టరు).

ఆమె మాతృభాష తుళు. పుట్టిపెరిగింది కర్నాటక రాష్ట్రంలో అయినప్పటికీ దక్షిణాది భాషా చిత్రాలలో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది.

2005లో సూపర్ అనే తెలుగు చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆమె చివరగా నటించి విడుదలైన చిత్రం పేరు బాహుబలి (ముగింపు భాగం).

సూపర్ చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. ఈ చిత్రంలో నాగార్జున కథానాయకుడు. తాను నటించిన తొలి సినిమాలోనే ఆమెకు ఫిలిం ఫేర్ అవార్డు లభించడం విశేషం.

అనంతరం విక్రమార్కుడు, లక్ష్యం తదితర చిత్రాలలో నటించిన అనుష్క తమిళంలోనూ రంగప్రవేశం చేయకపోలేదు. తమిళంలో ఆమె చేసిన తొలి సినిమా పేరు “రెండు” (2006).

ఫెవికాల్ ప్రాడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకున్న ఆమె బెంగళూరులో పాఠశాల నుంచి కళాశాల వరకూ చదువుకుంది. కుటుంబ సభ్యులు అనుష్కను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులేమో టొమ్ములు అని ముద్దుగా పిలుస్తారు.

బెంగళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాల నుండి బీసీఏ పట్టా పొందిన అనుష్క యోగా శిక్షణ కూడా ఇస్తుంది..

యోగాలో అనుష్క గురువు ప్రముఖ యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.

సినీ హీరో నాగార్జున ప్రోత్సాహంతో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టిన ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన అరుంధతి చిత్రాన్ని ఆమె కెరీర్ లో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆ అరుంధతి చిత్రంలో ఆమె అరుంధతి, జేజమ్మ పాత్రలను పోషించింది.

ఆమె నటించిన అరుంధతి చిత్రం 13 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. ఈ చిత్రం ఊహించని విజయం సాధించి 68 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాను తమిళంలోనూ డబ్ చేసి విడుదల చేయడం విశేషం.
తొలి సినిమాతోనే అందరి దృష్టించిన ఆకర్షించిన అనుష్క 2005లో నటించిన సూపర్ టిత్రంలో ఆమె పాత్ర పేరు సాష.

తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ స్క్రిప్ట్ ప్రధానమని చెప్పిన అనుష్క దర్శకుడు కూడా సమంచి సూచనలు చేస్తే ఇక వెనుదిరిగి చూడాల్సిన పని లేదు. ఇక్కడికే సగం పని పూర్తవుతుంది. స్క్రిప్ట్ ఏ మాత్రం బాగుందని అనిపించినా ఇక తాను వదులుకోబోనని చెప్పిన ఆమెకు బాలీవుడ్ లోనూ కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె నటించలేదు.

ఆమె నటిస్తున్న ఓ చిత్రం వచ్చే ఏడాదిలో ఏకంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రాబోతున్నది.

ఇలా ఉండగా ఇప్పటికింకా పెళ్ళి చేసుకోని అనుష్క ప్రభాస్ ను చేసుకుంటుందని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. అలాగే దర్శకుడు క్రిస్ తోనూ సంబంధాలు ఉన్నట్లు గుసగుసలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసిన అనుష్క రాశి వృశ్చికం. ఆమె ముద్దు పేరు మెక్.

ఆమెకు అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు ఎంతో ఇష్టమైన హీరోలు. అలాగే నటీమనుల విషయానికి వస్తే జ్యోతిక, సౌందర్య, సిమ్రాన్ అంటే ఇష్టం.

చిత్రానికి ఆమె దాదాపు రెండు మూడు కోట్ల వరకూ వేతనం తీసుకుంటారని ఓ మాట.

ఆమెకు ఇష్టమైన వంటకం చికెన్ తో చేసిన వేవైనా. యోగా అంటేనూ, పుస్తక పఠనమంటేనూ, ప్రయాణమంటేనూ, తోటంటేనూ ఆమెకు ఎంతో ఇష్టం.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.