అన్నయ్య పాత్రలో జగపతిబాబు

హీరో జగపతి బాబు అన్నయ్యగా నటించడానికి సమ్మతించారు. ఎస్ వీ కె సినిమా బ్యానర్ పై వంశీ కృష్ణ నిర్మిస్తున్న రా రా కృష్ణయ్య చిత్రంలో సందీప్ కిషన్ కు అన్నయ్యగా జగపతి బాబు నటిస్తారు. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన సందీప్ కిషన్ సినిమాలపై ఊహించిన దానికన్నా అంచనాలు పెరిగాయి. అతనికి జోడీగా రేజీనా నటిస్తున్న ఈ తాజా చిత్రంలో అన్నయ్యగా నటించడం తనకు ఇష్టమేనని  , అందుకే ఒప్పుకున్నారు.  అయితే జగపతి బాబు పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండేలా చిత్ర కధ సాగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల రా రా కృష్ణయ్య సినిమా చిత్రీకరణ శరవేగంతో సాగుతోంది. జగపతిబాబు, సందీప్ కిషన్ల మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయని దర్శకుడు మహేష్ చెప్పారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, అల్లరి రవి బాబు, కళ్యాణి, చలపతి రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అచ్చు సంగీతం సమకూరుస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.