అన్ని పాఠాలు అక్కడివే

మాతృత్వం నాకెంతో ఇష్టమైన అధ్యాయం అని చెప్పుకుంది ప్రముఖ నటి కాజల్.

సినీ పరిశ్రమలో గ్లామరస్ మదర్ లలో ఒకరుగా ఉన్న కాజల్ మాట్లాడుతూ “మాతృత్వం నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. నాకు ఓర్పు ఏమిటో నా కూతురు నేర్పింది. టెంపర్ కోల్పోకుండా ఉండటం ఎలాగన్నది కూతురే నేర్పింది. ఒకవేళ టెంపర్ కోల్పోయినప్పుడు ఎలా వ్యవహరించాలో కూడా కూతురే నేర్పింది. పిల్లలు పెరిగే కొద్దీ తల్లితండ్రులు, ముఖ్యంగా తల్లుల బాధ్యతలు పెరుగుతాయి. తల్లుల ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించాలి. పిల్లలు ఆరు నెలల అప్పుడు తాలిగా ఎలా ఉన్నానో అలాగే వాలు పెద్ద వాలు అయినప్పుడు ఉండలేం. మారాలి. అయితే నేను ఒక స్ట్రిక్ట్ తల్లినే. పిల్లలు పెరిగే కొద్దీ నిబంధనలు మారుతాయి. ఎప్పుడూ ఒకటే నిబంధన పనికిరాదు. లేకుంటే వాళ్ళు ఎదగరు. వాళ్ళు పురోగమించాలంటే మార్పులు తప్పవు. తల్లిదండ్రులకే కాదు పిల్లల లోను మార్పులు అనివార్యం. అజయ్ షూటింగ్ షెడ్యూల్ వాళ్ళ కిడ్స్ తో టైం స్పెండ్ చెయ్యడం కష్టం. కానీ అజయ్ ఇంటికి రావడంతోనే రూల్స్ అన్నీ పక్కన పెట్టడం జరుగుతుంది. తారలు ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటూ ఉంటారు. మనక్కి మనం పోల్చుకుంటూ ఉండ వలసి వస్తుంది. కడుపుతో  ఉన్నప్పుడు కొంచం లావుగా పొట్టతో కనిపించడం మామూలే. కొందరు ఆ సమయంలో అలా కనిపించడంలో ఎందుకో ఫీల్ అవుతారు. కానీ నేను ప్రతి క్షణాన్ని జీవించాను. వృత్తి మీద నేను ఫ్యామిలీని ఎంచుకున్నాను. మళ్ళీ వచ్చే జూలైలో కానీ ఆగస్ట్ లో కానీ నేను మా సొంత ప్రొడక్షన్ లో వెండితెర పై కనిపించే అవకాశాలు ఉన్నాయి” అని అన్నారు.

Send a Comment

Your email address will not be published.