అప్పుడే అరవై రోజులు గడిచాయా ?

“షూటింగ్ చేస్తుంటే అస్సలు కాలం తెలియడం లేదు. ఈ సినిమా కోసం అప్పుడే అరవై రోజులు షూటింగ్ పూర్తి చేసామంటే అస్సలు నమ్మబుద్ది కావట్లేదు” అంటోంది యోగా భామ అనుష్క. జక్కన్న సినిమాలో ఒక్కసారైనా అవకాశం దక్కాలని అందరూ కోరుకుంటారు. అలాంటిది నాకు ఆ అదృష్టం రెండో సారి కూడా దక్కటం ఏంతో సంతోషంగా ఉంది. అందులోనూ ఇండియన్ స్క్రీన్ పై ఇంత వరుకూ ఎవ్వరూ తెరకెక్కించని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న బాహుబలిలో నటించడం మధురానుభూతిగా ఫీల్ అవుతున్నానని అనుష్క అన్నారు.

మగధీర, ఈగ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా బాహుబలి. మొదటి సారి గా ప్రభాస్ ద్విపాత్రాభినయనం చేస్తున్నారు. సొంత అన్నదమ్ముల మధ్య ప్రేమాభిమానాల స్థానంలో ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం మొదలైతే వారి మధ్య బంధం ఎలా ఉంటుంది. మరో కురుక్షేత్రంగా మారుతుందా? అందులో ధర్మ విజేత ఎవరు అనే మహాభారత కధాంశంతో ఈ సినిమా తెర కెక్కుతుంది. ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా ప్రతినాయకుడి పాత్రలో రాణా నటిస్తున్నారు.

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అక్టోబర్ 24న విడుదల చేశారు. బాహుబలి మొదటి లుక్ ని ఫస్ట్ టీజర్ ని ఫేస్ బుక్ లో రాజమౌళి పోస్ట్ చేసిన వెంటనే కొన్ని లక్షల లైక్ లు వచ్చి పడ్డాయి. బాహుబలి మేకింగ్ వీడియోని కొన్ని లక్షల మంది చూసారు. ఫస్ట్ లుక్ తోనే ప్రభాస్ మిలీయనీర్ల క్లబ్ లో కూడా చేరి పోయాడు.

అనుష్క పుట్టిన రోజు సందర్భంగా నవంబెర్ 7వ తేదీన సెకండ్ టీజర్ ని విడుదల చేసారు రాజమౌళి. ఈ వీడియో లో బిహైండ్ ది సీన్స్ విడుదల చేశారు. ఈ సినిమా లో అనుష్క గెటప్, ఆమెకి మేకప్ చేస్తున్న దృశ్యాలు, అనుష్క డ్రెస్ ల కోసం డిజైనర్లు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ సందర్భం గా అనుష్క మాట్లాడుతూ భారతీయ సినిమా చరిత్ర లోనే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా బాహుబలి. ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడం నా అదృష్టం. ‘రాజమౌళి గారి సినిమాలో ఒక్క అవకాశం అయినా వస్తే బాగుండు అని ఎంతో మంది కోరుకుంటారు. నాకు ఆ అవకాశం మొదటిసారి విక్రమార్కుడులో వస్తే ఇప్పుడు రెండోసారి బాహుబలిలో దక్కింది. ఈ సినిమా కోసం అప్పుడే అరవై రోజులు షూటింగ్ పూర్తి చేసామంటే నాకు ఆశ్చర్యం గా ఉంది. అంత తొందరగా రోజులు గడిచి పోయాయి. రెండో షెడ్యూల్ కేరళ లో మూడు వారల పాటు జరుగుతుంది. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు పూర్తి అవుతుందా, సిల్వర్ స్క్రీన్ పైన చూద్దామా’ అని అభిమానులతో పాటు నాకు కూడా ఎంతో ఆసక్తి గా ఉంది అని సెలవిచ్చింది ఈ భామ.

Send a Comment

Your email address will not be published.