అభిమానులకోసమే...

Katamarayuduపవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా ఎప్పుడు జనం ముందుకు వచ్చినా అది సంచలనమే. ఆ సంచలనాన్నీ మించి బోలెడంత అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాన్ “కాటమరాయుడు” చిత్రం మీద.

కిషోర్ కుమార్ దర్శకత్వంలో రూపొంది వెండితెర కెక్కిన చిత్రం కాటమరాయుడు.

ఈ చిత్రంలో పవన్ సరసన నటించిన తార శృతి హాసన్.

నాజర్, రావు రమేష్, శివబాలాజీ, చైతన్య కృష్ణ, కమల్ కుమార్ రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం అనుప్ రూబెన్.

తమిళంలో అజిత్ నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం వీరం ను తెలుగులో పునర్నిర్మించారు.

కాటమరాయుడు పాత్రలో నటించిన పవన్ తన నలుగురు సోదరులతో కలిసి రాయలసీమలోని ఓ గగ్రామంలో నివసిస్తాడు. అతను స్థానికంగా ఓ రాజకీయ ఫాక్షనిస్ట్. కానీ అతను మంచికే కట్టుబడి నడచుకుంటాడు. తన ప్రాంతంలో ఎవరు ఏది చేయాలన్నా రాయుడిని సంప్రతించాలి. ఎందుకో కొన్ని కారణాల వల్ల రాయుడు పెళ్ళికి వ్యతిరేకి. అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. కానీ అతని సోదర్లకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. దానితో వాళ్ళు ఈ వ్యవహారాన్ని రహస్యంగా కొనసాగిస్తారు.

ఇలా ఉండగా ఓ నృత్యకారిణిగా శృతి హాసన్ వీరి పల్లెకు రావడం జరుగుతుంది. ఆమె అవంతి పాత్రలో నటించింది. ఆమె రాయుడు ఇంటికి ఎదురుగుండా ఉన్న ఇంట్లో నివసిస్తుంది. ఇలా ఉండగా ఆ అమ్మాయిని తన అన్నయ్య ఎలాగైనా చూసి ప్రేమలో పడితే బాగుంటుందని తమ్ముళ్ళు ఆశిస్తారు. ఈ విషయంలో వారు అలీ సహకారం తీసుకుంటారు. వారు అనుకున్నది జరుగుతుంది. అవంతి రాయుడిని తన పల్లెకు రావలసిందిగా తన తండ్రితో మాట్లాడవలసిందిగా చెప్తుంది. అవంతి తండ్రికి హింస అంటే గిట్టదు. కనుక రాయుడు హింసకు తిలోదకాలిచ్చి అవంతి తండ్రిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు.

అవంతి తండ్రికి కొందరు శత్రువులు ఉన్నారు. వారు పధకం ప్రకారం ఆయనను చంపడానికి నిర్ణయించుకుంటారు. రాయుడికి ఈ విషయం తెలుస్తుంది. కనుక అవంతి తండ్రిని కాపాడాలని అనుకుంటాడు రాయుడు. ఇందుకోసం రాయుడు తిరిగి హింసకు పూనుకున్నాడా? లేక మరేవైనా మార్గాలు ఎంచుకున్నాడా తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలి.

పవన్ కళ్యాణ్ నటన అద్భుతం. తిరుగులేదు. శ్రుతిహాసన్ తన పాత్రకు తగిన న్యాయమే చేసింది.

పవన్, రావు రమేష్ సంభాషణలు చక్కగా కుదిరాయి. వారి మాటల తీరు కట్టిపడేస్తాయి.

సినిమాలో ప్రధమార్థం అంతా పవన్ ఉన్న ఊరుకి సంబంధించినది. ద్వితీయార్థం అంతా శృతి హాసన్ ఉన్న పల్లెకు సంబంధించినది. ఈ రెండింటి మధ్య కథను పట్టుగా నడిపించడంలో దర్శకుడు కాస్తంత విఫలమయ్యాడు. కథలో మలుపులు లేకపోలేదు. కానీ పట్టు తప్పింది అక్కడక్కడా….

అనుప్ రూబెన్ సంగీతం పరవాలేదు. రెండు పాటలు బాగున్నాయి.

కాటమరాయుడు చిత్రం ఆయన అభిమానులకు ఓ విందు.

దర్శకుడు ద్వితీయార్థం పై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఏదేమైనా చిత్రం చూడదగ్గదే. అందులో అనుమానం లేదు.

Send a Comment

Your email address will not be published.