అభిమానుల కోసం

Paisa Vasoolవచ్చేసింది బాలయ్య చిత్రం పైసా వసూల్.
నందమూరి బాలకృష్ణతో పాటు శ్రియ, ముస్కాన్, కైరా దత్, విక్రమ్ జీత్ మాలిక్, ఆలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకులు పూరి జగన్నాథ్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా పూరీ జగన్నాథ్ వే. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.

ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర కథలోకి వెళ్దాం…

చిత్రంలో నందమూరి బాలకృష్ణ పాత్ర పేరు తేడా సింగ్. కథాపరంగా ఆయన ఒక రౌడీ. ఆయనకు ఇల్లు లేదు. పిల్లా పీచు అంటూ ఎవరూ లేరు. కుటుంబం లేదు. అయితే ఆయన తనకు ఎవరు ఎదురు తిరిగినా వారిని కొట్టడం వెళ్ళిపోవడం ఒక్కటే తెలుసు. ఎవరినీ లెక్క చేయడు. అయితే విదేశంలో ఉండి మాతృదేశంలో నేరాలు ఘోరాలు చేయిస్తున్న డాన్ బాబ్ మార్లే అగడాలకు అడ్డుకట్టవేయడానికి తేడా సింగ్ తగిన వాడని పోలీసులు అనుకుంటారు. అదే విధంగా ఆయనను రంగంలో దింపుతారు. డాన్ బాబ్ మార్లే పాత్రను విక్రమ్ జీత్ మాలిక్ పోషిస్తాడు. తను అప్పగించిన పనిని చేస్తానని చెప్పిన తేడా సింగ్ తీరా రంగంలో దిగిన తర్వాత బాబ్ మార్లేతో చేతులు కలుపుతాడు. ఇంతలో తేడా సింగ్ తమతో చెప్పినవన్నీ అబద్ధాలని పోలీసులు గ్రహిస్తారు. ఇలా ఉండగా, తేడా సింగ్ అసలెవరనే విషయమై తెలుసుకోవడంలో బాబ్ మార్లే మనుషులు పని మొదలెడతారు. తెలుసుకుంటారు కూడా. అయితే ఈ తేడా సింగం ఎవరు బాబ్ మార్లే ఆగడాలకు అడ్డుకట్ట వేశాడా లేదో తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలి.

పాత్రల అసలు విషయం పక్కనపెట్టి బాలయ్య అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం చేసినట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు మిగిలిన విషయాలపై తమ దృష్టిని కేంద్రీకరించలేదా అని అనిపిస్తుంది. బాలయ్య కోసం ఈ చిత్రం నిర్మించినట్లు అనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఏదో కథ ఉందనుకుని థియేటర్ కు వెళితే ప్రేక్షకులకు విసుగేయడం ఖాయం.

ఈ చిత్రంలో బాలకృష్ణ గెటపం, బాడీ లాంగ్వేజ్, మాటలు పలకడంలోనూ అంతా కొత్తదనమే అనిపించేలా మలిచారు బాలయ్య పాత్రను. ఆయనను ఏదో కొత్తగా చూపాలన్న తాపత్రయం కనిపిస్తుంది. కానీ ప్రేక్షకులు ఎంత వరకు తృప్తి చెందుతారన్నది అనుమానమే.

మాటలు పరవాలేదు. బాలయ్య మాటలు కొన్ని అభిమానులకు తోచుకోనివ్వదు. ఆయన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు బాగుంటుంది.

ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం డల్లుగా సాగింది.

ఈ చిత్ర సన్నివేశం క్లైమాక్స్ కూడా అంత బాగులేదు.

ఈ సినిమా అంతా బాలయ్యకోసం తీసినట్టే అనిపిస్తుంది. బాలయ్య మాటల ఉచ్చారణలో కొత్తదనం లేకపోలేదు.

హీరోయిన్లలో ముస్కాన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. శ్రియ పాత్ర పరవాలేదు. ఇదొక డాన్ పాత్ర. మాఫియా డాన్ పాత్రే ఇది. కబీర్ బేడి కూడా చేసిందేమీ లేదు. ఆలీ సినిమాలో చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి అనడంలో సందేహం లేదు.

కధను నడిపించడంలో దర్శకుడు పూరీ విఫలమయ్యాడు. సంగీతం సుమారుగా ఉంది.
కేవలం కాలక్షేప చిత్రమే పైసా వసూల్

Send a Comment

Your email address will not be published.