అభిరుచులు కలవకుంటే కష్టాలు తప్పవు

విజయనిర్మల తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం మీనా. ఆ చిత్రంలో మీనా పాత్ర కూడా ఆమే పోషించారు. నలభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ నిర్మల పెళ్ళైన తర్వాత భార్యా భర్తల మధ్య అభిరుచులు కలవకుంటే కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు.

సినిమా రంగంలో అగ్రస్థాయిలో ఉంటూ బిజీగా ఉంటూ వచ్చిన కొందరు తారలు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతుంటారు. కానీ మీ విషయంలో….. అని ఒకసారి ఓ విలేఖరి అడగ్గా విజయనిర్మల ఇలా జవాబిచ్చారు….

“నా జీవితంలో మీరు చెప్పిన విషయం పూర్తిగా రివర్స్ అయ్యింది. పెళ్ళికి ముందు దాదాపు యాభై చిత్రాల్లో నటిస్తే పెళ్లి అయిన  తర్వాత రెండు వందల చిత్రాల వరకు నటించాను. వాటిలో ఎక్కువ చిత్రాలు కృష్ణ గారితో కలిసి నటించినవి ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత నటనకు బ్రేక్ పడటం సాధారణమే. కానీ నాకు, కృష్ణ గారికి మధ్య అభిరుచులు కలిసిపోయాయి. కనుక నటనకు దూరం కాలేదు. కృష్ణ గారిలా మంచి భర్త దొరికితే ఎవరైనా ఏ కెరీర్ అయినా సాఫీగా సజావుగా చేసుకుపోవచ్చు భార్య భర్తల మధ్య అభిరుచులు కలవకపోతే మాత్రం కష్టాలు తప్పవు” అని.

Send a Comment

Your email address will not be published.