అమలాపాల్ కు పెళ్లి?

రామ్ చరణ్ “నాయక్”, అల్లు అర్జున్ “ఇద్దరమ్మాయిలతో” సిద్దార్ధ “లవ్ ఫెయిల్యూర్ ” చిత్రాల్లో నటించిన అమలాపాల్ కు త్వరలో పెళ్లి కాబోతోందని వార్త.
తలైవా అనే తమిళ సినిమా దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో అమలాపాల్ మూడు ముళ్ళు వేయించుకోబోతోంది.
విజయ్ దర్శకత్వం వహించిన నానా చిత్రంలో అమలాపాల్ నటించిన సంగతి తెలిసిదే కదా…ఈ చిత్రం నుంచే వీరి మధ్య బంధం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువచ్చిందని అంటారు. వీరి పెళ్లి జూన్ 12న జరిగే అవకాశాలు ఉన్నాయి.
మేమిద్దరం తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతోందని ఇద్దరూ చెప్పుకుంటున్నా పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని అన్నారు.
విజయ్ దర్శకత్వం వహించిన శైవం చిత్రం రిలీజ్ డేట్ తో వీరి పెళ్లి తేదీ ముడిపడి ఉంది.
ఒకవేళ శైవం చిత్రం మే ఒకటిన విడుదల అయ్యేపక్షంలో వీరి పెళ్లి జూన్ 12న జరుగుతుంది. ఒకవేళ ఈ చిత్రం విడుదల ఆలస్యమైతే వీరి పెళ్లి మరో రెండు మూడు నెలల తర్వాత జరుగుతుందని అనుకుంటున్నారు. తేదీ మాట ఎలా ఉన్నా వీరు ఒక్కటవడం ఖాయమట.
ప్రస్తుతం ఆమె ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది.

Send a Comment

Your email address will not be published.