అమలా పాల్, విజయ్ విడిపోతున్నారా...?

అవును విడిపోతున్నారనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. 2014 లో నటిగా బిజీగా ఉన్నప్పుడు అమలా పాల్ విజయ్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పట్లోనూ ఈ వార్త శరవేగంతో సినీ పరిశ్రమలో చెప్పుకున్నారు.
ప్రభు సాలమన్ దర్శకత్వంలో మైనా అనే సినిమాలో అమల నటించగా అది హిట్టు కొట్టింది. ఆ తర్వాత విజయ్ దర్శకత్వంలో ఆమె చియాన్ విక్రంతో కలిసి దైవరుమగళ్ అనే తమిళ చిత్రంలో నటించింది. తెలుగులో ఈ చిత్రం నాన్న పేరుతో వచ్చింది. ఈ దైవ తిరుమగళ్ చిత్రం వస్తున్న సమయంలోనే అమలా పాల్, విజయ్ ల మధ్య ప్రేమ చిగురించింది. మూడేళ్లు సాగింది వీరి ప్రేమకథ. 2014 జూన్ 7 వ తేదీన వీరి నిశ్చితార్ధం జరిగింది. 12 వ తేదీన విజయ్ మూడు ముళ్ళు వేశారు. వీరి పెళ్లి చెన్నైలో కిక్కిరిసిన నటీనటుల మధ్య జరిగింది.

పెళ్లి అయినా తర్వాత అమలాపాల్ జంట చెన్నైలోని బోట్ క్లబ్ లో ఓ పెద్ద బంగళాలో కాపురం పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయని, విడిపోతున్నారని వార్తలు రావడం మొదలుపెట్టాయి. కొన్ని నెలలుగా వీరి మధ్య సంబంధాలు సాఫీగా లేదని ఇద్దరి మాటగానే విడిపోవాలని అనుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. పేస్ బుక్ లో తరచూ తన భర్త విజయ్ తో కలిసున్న ఫొటోస్ పోస్ట్ చేస్తూ వచ్చిన అమలా పాల్ కొన్ని రోజులుగా ఫొటోస్ ఏవీ పెట్టడం లేదు.

పెళ్ళైన తర్వాత కూడా అమలా పాల్ నటిస్తూ రావడమే భర్త విజయ్ తో అభిప్రాయబేధాలు తలెత్తినట్టు అనుకుంటున్నారు. ఈ కారణంగానే విడిపోవాలని అనుకున్నారట. అంతేకాకుండా ఇద్దరి మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా విజయ్ దీనిపై మాట్లాడటానికి నిరాకరించారు. ఈ విషయంలో తన తల్లిదండ్రుల మాటకే కట్టుబడి ఉంటానని మాత్రం విజయ్ చెప్పారు. మరోవైపు అమలా పాల్ కూడా దీనిపై మాట్లాడటానికి అంగీకరించలేదు.

Send a Comment

Your email address will not be published.