ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు బాలకృష్ణ తన వందో సినిమాకు సంబంధించి ఇద్దరు దర్శకులు ముందంజలో ఉన్నారని, ఆ వివరాలు అమావాస్య తర్వాత వెల్లడిస్తానని చెప్పారు.
దర్శకులు క్రిష్, కృష్ణవంశి తమ స్క్రిప్ట్స్ తో రెడీగా ఉన్నారని చెప్తూ కృష్ణవంశి తయారు చేసిన కథ రైతులకు సంబంధించినదని, క్రిష్ “గౌతమీ పుత్ర శాతకర్ణి (మొట్టమొదటి ఆంద్ర రాజ్యానికి ) కథతో సిద్ధంగా ఉన్నారని బాలకృష్ణ చెప్పారు.ఈ రెండు కథల్లో ఓ కథ చెయ్యాలో అనే దానిపై అమావాస్య తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి కథ పట్ల బాలక్రిష్ణ ఆసక్తి చూపుతున్నట్టు సన్నిహిత వర్గాల భోగట్టా. అది భారీ బడ్జెట్ చిత్రమని, ఈ చిత్రానికి సెట్స్ కూడా చాలా రిచ్ గా ఉంటాయని ఆ వర్గాల మాట. ఈ రెండు చిత్రాలలో ఏదో ఒకటి ఎన్నుకున్న తర్వాత ఆదిత్య 369కి కొనసాగింపుగా మరో చిత్రంలో బాలకృష్ణ నటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.