"అలా ఎలా" అంటూ...

విజయం సాధించలేదు కానీ …పేరైతే మిగిలింది

అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “అలా ఎలా” విడుదలైంది. కానీ సరైన సమయంలో ప్రేక్షకుల  ముందుకు రాలేకపోయిందనే టాక్ వచ్చింది. అటు రఫ్….ఇటు యమలీల – 2 సినిమాలు విడుదలైన సమయంలో వాటి మధ్య కాలంలో వచ్చిన సినిమా అలా ఎలా…..
ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒకరు రాహుల్ రవీంద్రన్, మరొకరు వెన్నెల కిషోర్. ఇంకొకరు  సాలమన్ షాని.
ఇదొక చిన్న సినిమా. భిన్నమైన పబ్లిసిటీతో కొత్తగా ఉంటుందని ఆశ కలిగించిన చిత్రం అలా ఎలా.
హైదరాబాదులో ఒక ఐ టీ సంస్థలో పనిచేసే రాహుల్ రవీంద్రన్ కు ఒక తాతయ్య ఉంటాడు. ఆ తాత చివరి కోరిక తన చిరకాల మిత్రుడి మనవరాలిని పెళ్లి చేసుకోమని మనవడుగా నటించిన రాహుల్ తో  ఒట్టు వేయించుకుంటాడు. వాళ్ళు బాగా కట్నం ఇస్తారని రాహుల్ ఆశిస్తాడు. అయితే ఇక్కడో చిన్న కథ ఉంది. ఆ అమ్మాయి రాజోలులో ఉంటుంది. అక్కడికి వెళ్లి తాను ఎవరో చెప్పకుండా ఆ అమ్మాయి మనసులో చోటు పొందాలనుకుంటాడు. తన మిత్రులైన వెన్నెల కిషోర్, షానిలను వెంటపెట్టుకుని రాజోలు వెళ్తాడు రాహుల్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రాహుల్ కి హీబా పటేల్ పరిచయమవుతుంది. అక్కడ మరి రాహుల్ తాతయ్య మిత్రుడి మనవరాలు ఖుషి మనసు గెలుచుకున్నాడా? లేక హీబా పటేల్ తో అయిన పరిచయం ఎటు తీసుకువెళ్తుంది అనేదే ఈ సినిమా కథ. రాహుల్ కి అతని మిత్రులు ఎలా సాయపడ్డారు ….కథ ఎలా మలుపు తిరిగింది వంటి అంశాలన్నీ తెర మీద చూడవలసిందే.
ఈ చిత్రంలో రాహుల్, వెన్నెల కిషోర్, శానిలతోపాటు హీబా పటేల్, ఖుషీ, భానుశ్రీ, మెహ్రా, తదితరులు నటించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, తమ సినిమాకు చెందిన మార్కెటింగ్ టీం ఈ సినిమాను జనంలోకి తీసుకుపోవడానికి ఎంతో కస్తాపదిమ్దని, అయితే ఈ సినిమా విడుదల అయిన రఫ్, యమలీల – 2 కూడా రావడంతో తమ సినిమా పోటీలో కాస్త వెనక ఉండిపోయిందని అన్నారు. అయినా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ హాయిగా ఎంజాయ్ చేసామన్న ఫీలింగు తో హాలు నుంచి బయటకు వస్తారని రాహుల్ అన్నారు. దర్శకులు అనీష్ కృష్ణ తమ ప్రతిభకు మంచి అవకాశం ఇచ్చారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నానని రాహుల్ తెలిపారు. తాము నటిస్తున్నప్పుడు కట్ అని దర్శకులు ఎప్పుడూ చెప్పలేదని, స్క్రిప్ట్ నుంచి దూరమవుతున్నామని అనిపించినప్పుడు మాత్రమె ఆయన కట్ చెప్పారని, అలాంటి సందర్భాలు చాల తక్కువని రాహుల్ అన్నారు.
సహజమైన హాస్యంతో సాగిన ఈ సినిమా తమకో గొప్ప అనుభవమని,, మంచి అనుభూతిని మిగిల్చిందని రాహుల్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.