అల్లుడు శ్రీను విజయంతో...

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎంతో ఆనందంగా ఉన్నారు. కారణం ……….ఆయన పుత్రుడు బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం అల్లుడు శ్రీను అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయం సాధించడంతో.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ తన కుమారుడు అల్లుడు మొదటి చిత్రం నలభై కోట్ల క్లబ్బులో చేరడం ఆనందంగా ఉందన్నారు.

ఒక కొత్త నటుడితో సినిమా చెయ్యడానికి నిర్మాతలు ఎవరైనా రిస్క్ తీసుకోవడానికి ముందు వెనుకలు ఆలోచిస్తారని, అది సహజమని అంటూ అందుకే తానే తన కొడుకు చిత్రాన్ని నిర్మించానని చెప్పారు. తన మొదటి సినిమాతోనే తాను కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకోగలనని తన కొడుకు రుజువు చేసుకున్నాడని అన్నారు. తాను అనుకున్న దానికన్నా భారీ బడ్జెట్ తో తీసిన అల్లుడు శ్రీను సినిమా బాగా ఆడుతోందని చెప్పారు. భారీ వ్యయంతో ఈ సినిమా చేస్తున్నప్పుడు కొందరు తనను మరొక్కసారి ఖర్చు విషయం ఆలోచించు అని సూచించారని అన్నారు. అయినా ఎవ్వరు ఏం చెప్పినా తాను రిస్క్ తీసుకునే ఈ సినిమా చేసినట్టు చెప్పారు. రిస్క్ తీసుకున్నందుకు సినిమా విజయవంతంగా ఆడటం మహదానందంగా ఉందని సురేష్ తెలిప్పారు.

తన తదుపరి చిత్రానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని, ఈ సినిమా ఈ నెలాఖరులో మొదలవుతుందని సురేష్ చెప్పారు.

తన కుమారుడితోనే మరో సినిమా తానే త్వరలో ప్రారంభిస్తానని సురేష్ బెల్లంకొండ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.