అల్లుడు శ్రీను ?

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ నటిస్తున్న చిత్రానికి వీ వీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటలీలో ఈ మధ్యే ఈ సినిమా తాలూకు పాటలను చిత్రీకరించారు. పాటల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ స్వదేశం చేరుకుంది. ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ పాత్ర పోషిస్తింది. మరోవైపు తమన్నా ఒక ప్రతేకమైన పాటలో నటించింది.

ఈ చిత్రం ఎప్పుడో ముహూర్తపు షాట్ చేసుకున్నా షూటింగ్  మాత్రం ఇటీవలే మొదలైంది. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని వీ వీ వినాయక్ బెల్లంకొండ సురేష్ కు హామీ ఇచ్చారు. కనుక చిత్ర తయారీలో తాను రాజీపడబోనని దర్శకుడు స్పష్టం చేసారు. తాను వంద శాతం మనసు పెట్టి పని చేస్తున్న ఈ చిత్రానికి అల్లుడు శ్రీను అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ టైటిల్ ఖాయం చేయవచ్చని తెలుస్తోంది. పూర్తి కుటుంబ కథా చిత్రమైన ఈ సినిమాలో వినోదానికి ఏ మాత్రం లోటు ఉండదని చిత్ర యూనిట్ చెప్తోంది. వీ వీ వినాయక్ “మార్క్” ఇందులో చూడవచ్చని కూడా చెప్తున్నాది.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తాన్నారు.

Send a Comment

Your email address will not be published.