అల్లు అర్జున్ కొత్త సినిమా

ఇప్పుడు అది అధికారికంగా వెల్లడైంది…..అదేనండీ, అల్లు అర్జున్ దర్శకుడు బోయపాటితో కలిసి తన తదుపరి చిత్రం చేయబోతున్నాడు అన్న విషయం. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ మీద నిర్మించబోతున్నారు.

“చాలాకాలం నుంచే మేము అనుకుంటున్నాం….అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా తీయాలి అని. ఈ చిత్రం షూటింగ్  మేము వచ్చే ఏప్రిల్ నెలలో మొదలు పెడతాం. అయితే ముహూర్తం మాత్రం ముందే అంటే మార్చి నెలలో ఉంటుంది…” అని అల్లు అరవింద్  అన్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇప్పటికి భిన్నంగా కనిపిస్తాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. హీరో మాత్రం అల్లు అర్జున్ ఒక్కడే.

అల్లు అర్జున్ తో వర్క్ చేయడం తనకు ఇష్టమేనని బోయపాటి చెప్పారు.

అల్లు అర్జున్ కి అన్ని విధాల సరిపోయే కథ ఇప్పటికే తయారైనట్టు బోయపాటి శ్రీను అన్నారు. అల్లు అర్జున్ లో ఓ కొత్త నటుడిని చూడవచ్చు అని కూడా చెప్పారు బోయపాటి.

ప్రస్తుతం అల్లు అర్జున్ “సన్ ఆఫ్ సత్యమూర్తి” చిత్రాన్ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో ఓ రెండు పాటలు  అల్లు అర్జున్ పై  స్పెయిన్ లో చిత్రీకరిస్తారు.

Send a Comment

Your email address will not be published.