అల్లు శిరీష్ కొత్త...

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కొత్త ప్రాజెక్టుకి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు పరశురాం తో శిరీష్ నూతన చిత్రం తయారవుతుంది. శిరీష్ ఇంతకాలమూ మంచి స్క్రిప్ట్ కోసం నిరీక్షించాడు. చివరికి ఇప్పడే తనకు నచ్చిన స్క్రిప్ట్ రావడంతో సినిమా చేయడానికి సమ్మతించాడు.

అల్లు శిరీష్ భిన్నమైన కథతో ప్రేకషకుల ముందుకు రావాలనుకున్నాడని, అంతే తప్ప ఎప్పుడూ ఒకే ఫార్ములాతో సినిమా చేయడం అతనికి ఇష్టం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందుకే శిరీష్ కొత్త సినిమా రావడానికి ఆలస్యమైందని కూడా ఆ వర్గాలు చెప్పాయి. ఓ ఆఫ్బీట్ కథతో తన సినీ జీవితానికి శ్రీకారం చుట్టాలనుకున్నాడని, అయితే కొత్త జంట సినిమా అనుకోకుండా ఓ కమర్షియల్ పిక్చర్ గా అందరి ముందుకు వచ్చిందని, ఇప్పుడు శిరీష్ పూర్తిగా ఒక ఫ్యామిలీ కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడని ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా అ సినిమా వినోదాత్మకంగాను ఉండాలన్నది అతని కోరికట.

దర్శకుడు పరశురాం గతంలో సోలో, ఆంజనేయులు, యువతః తదితర చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన శిరీష్ కు నచ్చిన కథతో ముందుకు రావడం గమనార్హం.

ఈ నెల చివరి వారంలో అల్లు శిరీష్, పరశురాం కాంబినేషన్ లో ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలు కావచ్చు.

Send a Comment

Your email address will not be published.