అవతరించిన "అవతారం"

గ్రాఫిక్స్ వర్క్ ను సంతృప్తికరంగా వినియోగించుకున్న అవతారం చిత్రం ఏప్రిల్ 18న విడుదల అయ్యింది. కథను తయారు చేసుకున్న తర్వాత అందులో కొన్ని భాగాల చిత్రీకరణ కొత్తగా, గమ్మత్తుగా. హృదయానికి హత్తుకునేలా, కంటికి ఇంపుగా కనిపించేలా తీయాలన్న క్రమంలో అవతారం చిత్రం గ్రాఫిక్స్ ను అవసరమైన మేరకు ఉపయోగించుకుని వెండి తెర కెక్కింది. ఆవు, ఎద్దు, 12 తలల నాగామకరం అనే పాము, సింహం తలలో ఒక లేడి..అది దేవతా రూపం. సింహం తల మాట్లాడటం వంటివి ఇందులో  చక్కగా చిత్రీకరించారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ను సమర్ధవంతంగా, అర్ధవంతంగా వినియోగించుకున్నారు. అరుంధతి ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై యువ నిర్మాత ఎం యుగంధర్ రెడ్డి నిర్మించిన ఈ అద్భుత గ్రాఫిక్స్ మాయాజాలం అవతారం చిత్రంలో గ్రాఫిక్స్ కు రూపకల్పన చేసిన జెమిని గ్రాఫిక్స్ టెక్నికల్ హెడ్ శీలం బాలచంద్ర (బాలు)ను అన్ని విధాల అభినందించాలి. ఈ చిత్రంలో 90 నిముషాల పాటు గ్రాఫిక్స్ వర్క్స్ జరిగాయి. ఇందుకోసం 2 సంవత్సరాలు వెచ్చించారు శీలం బాలచంద్ర.  ఆస్ట్రేలియా, లండన్ నుంచి సాంకేతిక నిపుణులను రప్పించి వారి సహకారమూ గ్రాఫిక్స్ విభాగంలో వినియోగింఘారు. దర్శకుడు కోడి రామకృష్ణ పిల్లల కోసం కొత్త క్యారక్టర్ సృష్టించారు. ఇందుకోసం ఏడెనిమిది స్కెచ్ లు వేసి క్యారక్టర్ క్రియేట్ చేయడం విశేషం.

Send a Comment

Your email address will not be published.