అవసరాల మార్క్ చిత్రం

నటుడు, రచయిత, దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నారా రోహిత్ , నాగశౌర్య , రెజీనా, పావని గంగిరెడ్డి, రాజేశ్వరి , తనికెళ్ల భరణి, కృష్ణచైతన్య, శశాంక్, సీత తదితరుల నటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘జ్యో అచ్యుతానంద’. కళ్యాణ రమణ సంగీతం సమకూచారు. చిత్రానికి నిర్మాత కొర్రపాటి రజని.

అచ్యుత రామారావు పాత్రలో నటినచిన నారా రోహిత్, ఆనందవర్ధన్ రావు పాత్రలో నటించిన నాగశౌర్య అన్నదమ్ములు. అన్నదమ్ములు కావచ్చు కానీ వీరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. వీళ్ళు ఉంటున్న ఇంట్లోనే పైనున్న వాటాలోకి రెజీనా అద్దెకు వస్తుంది. ఆమె పాత్ర పేరు జ్యోత్స్న.

ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతాయి. అన్నదమ్ములిద్దరూ రెజీనాను ప్రేమిస్తారు. వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే ఆ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి నానాపాట్లు పడతారు. ఇద్దరూ తననంటే తననే ప్రేమిస్తున్నట్టు ఊహల్లో తేలుతుంటారు. ఓ మంచి రోజు చూసుకుని ఇద్దరూ తమ ప్రేమను విడివిడిగా రెజీనాతో చెప్పుకుంటారు. కానీ వారి మాటలన్నీ విన్న రెజీనా వాళ్లకు ఏం చెప్పింది అన్న విషయం తెలుసుకోవాలన్నా, ఆమె చెప్పిన మాటల వల్ల కథలో చోటు చేసుకున్న మలుపులు తెలుసుకోవాలన్నా వెండితెరపై ఈ చిత్రం చూడాలి.

‘జ్యో అచ్యుతానంద’లో అన్నదమ్ముల అనుబంధాన్ని రమ్యంగా చిత్రించిన దర్శకుడు అవసరాల తగిన మోతాదులోనే వినోదాన్ని పండించారు.

ఆహ్లాదకరంగా సాగిపోయిన ఈ చిత్రంలో సెన్సాఫ్ హ్యూమర్ కు కూడా కొరత లేదు. సరదాగా సాగిపోయే ఈ చిత్రంలో నారా రోహిత్, నాగశౌర్యల తమ తమ పాత్రలకు అన్ని విధాలా వంద శాతం న్యాయం చేశారు అని చెప్పడానికి ఆలోచించక్కర లేదు. వీరి నటన అద్భుతం.

రెజీనా కూడా చక్కగా నటించింది.

పావని, రాజేశ్వరి, తనికెళ్ల భరణి నటన గురించి వేరేగా చెప్పక్కర లేదు.

కళ్యాణ రమణ సంగీతం వినసొంపుగా ఉంది.

అవసరాల రచయితగా., దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్న అవసరాలకు వంద మార్కులు వేయాల్సిందే. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తనదైన శైలి తగిన మాటలు రాసిన అవసరాల సాహిత్యం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది.

జ్యో అచ్యుతానంద చిత్రాన్ని సకుటుంబంగా చూసి ఆనందించవచ్చు.

Send a Comment

Your email address will not be published.