“గౌతమీ పుత్ర శాతకర్ణి” పాటల సి డీ ఆవిష్కరణ
“లెజెండ్” సినిమాని మించి “గౌతమీ పుత్ర శాతకర్ణి” వెయ్యి రోజులు ఆడుతుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని ఆంద్ర ప్రర్దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు అన్నారు.
తిరుపతిలో డిసెంబర్ 26 వ తేదీన “గౌతమీ పుత్ర శాతకర్ణి” చిత్రం తాలూకు ఆడియో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖమంత్రి చద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గౌతమీ పుత్ర శాతకర్ణి” చిత్రం తెలుగువారు గర్వించదగ్గ చిత్రం అని చెప్పారు.
కేంద్రమంత్రి ఏం. వెంకయ్య నాయుడుతో కలిసి చంద్రబాబు ఈ చిత్రం పాటల సీడీని ఆవిష్కరించారు. దర్శకుడు క్రిష్ పట్టుదలతో తీసిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని నారా అన్నారు. ఆంధ్రులు గుర్తు పెట్టుకోవలసిన రాజు శాతకర్ణి అని చెప్తూ తల్లికి, స్త్రీకి గౌరవమివ్వాలని చెప్పిన రాజు శాతకర్ణి అని తెలిపారు.
ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జాగర్లమూడి సాయిబాబు, రాజేవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “గౌతమీ పుత్ర శాతకర్ణి”.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సినిమా గురించి తనకు ఎక్కువగా తెలియదంటూ తెలుగు వారి చరిత్రకు అద్దం పట్టే ఈ చిత్రం అద్భుతమని చెప్పారు. అందుకు చిత్ర యూనిట్ కు ఆయన అభినందనలు తెలిపారు.
ఇలా ఉండగా చిత్రంలో శాతకర్ణిగా నటించిన బాలకృష్ణకు ఇది వందో చిత్రం కావడం విశేషం. ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం ట్రైలర్ కు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని, తన తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇటువంటి చిత్రం చేయడం తన పూర్వజన్మసుకృతం అని అని తెలిపారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లిగా హేమమాలిని నటించారు.
ఈ వేడుకలో దర్శకుడు క్రిష్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటల రచయిత సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు.