ఆగకుండా వచ్చేసాడు

ప్రిన్స్ మహేష్ బాబు చేసిన మరో యాక్షన్ , కమర్షియల్, వినోదాత్మక చిత్రం ‘ఆగడు’ వచ్చేసాడు ఆగకుండా.

దూకుడు తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది.

ఈ సినిమాలో మహేష్ బాబు అసలుసిసలు పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. మహేశ్ సరసన మొదటిసారిగా తమన్నా హీరోయిన్ గా నటిస్తే శృతి హాసన్ ఒక ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసింది. భారీ అంచనాలతో వేల థియేటర్ లలో అట్టహాసంగా విడుదల అయిన ఆగడు చిత్ర నిర్మాతలు సుంకర అనిల్. ఆచంట రామ్. ఆచంట గోపీ. ఎస్ ఎస్ తమన్ స్వరాలూ అందించారు.

ఓ అనాధ అయినప్పటికీ తెలివైన కుర్రాడుగా నటించే మహేష్ లోని ప్రతిభను చూసి పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ అతన్నిదగ్గరకు తీసుకుని పోలీస్ ఆఫీసర్ గా చెయ్యాలనుకుంటాడు.

కానీ మహేష్ ఒక కుర్రాడిని అనుకోకుండా చంపేయడంతో రాజేంద్ర ప్రసాద్ అతనితో సంబంధాలు తెంపుకుంటాడు. మహేష్ బాబుని హత్య కేసులో అరెస్ట్ చేస్తారు. ఓ స్కూల్ లో చదివిన మహేష్ ఆ తర్వాత పోలీస్ అవుతాడు. అప్పుడే బుక్కపట్టణంలో సోను సూద్ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి మహేష్ ని ఆ పట్టణంలో సిఐగా పంపుతారు. అక్కడికి వెళ్ళిన మహేష్ కి ఓ వాస్తవం తెలుసుకుంటాడు. అదేమిటో తెలుసుకుని సోను సూద్ ఆగడాలను మహేష్ ఎలా అడ్డుకున్నాడు అనేది కథాంశం.

ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమాలోనూ సరికొత్త మానరిజమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. పైగా మహేష్ బాబు రాయలసీమ యాసలో మాట్లాడిన డైలాగులకు మంచి స్పందనే లభించింది.

ఇక యాక్షన్ సన్నివేశాలలో మహేష్ జోరు, హోరు విడిగా చెప్పక్కర్లేదు. పాటల్లో మహేష్ స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

మొదటిసారి మహేష్ తో సరసన నటించిన తమన్నాకి పాత్ర చిన్నదే . అయినా ఉన్నంత సేపూ మాత్రం ఆమె తన గ్లామర్ తోను, నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రాజేంద్ర ప్రసాద్ తన పాత్రకి న్యాయం చేసాడు.

ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర కీలకమైనదే. ఆయన బ్రోకర్ పాత్రలో చెప్పుకోదగ్గ రీతిలో నవ్వించాడు. బ్రహ్మానందంకి రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయన కామెడీ సరిగ్గా పండలేదు.

నాజర్ కి ఈ సినిమాలో కాస్తంత భిన్నమైన పాత్ర ఇచ్చారు.

పోసాని తదితరులు నటించిన ఈ సినిమాలో కథకి తక్కువ మార్కులే వెయ్యవచ్చు. నీరసంగా సాగిన కథలో చెప్పుకోదగిన అంశాలు లేవు.

శ్రీను వైట్లదర్శకత్వం బాగానే ఉంది.

Send a Comment

Your email address will not be published.