ఆగలేదు..సాగుతోంది..టెంపర్

హరికృష్ణ కుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించడంతో టెంపర్ సినిమా షూటింగ్ ఆగిపోతుందా అనే మాట తెరపైకి వచ్చింది. సోదరుడి ఆకస్మిక మరణంతో జూనియర్ ఎన్టీఆర్ షాక్ తిన్నట్టు, కొన్ని రోజులకు టెంపర్ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని అనుకున్నారు. ఆయన ఈ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఆ తర్వాత షూటింగ్ మళ్ళీ కొనసాగిస్తే మంచిదని అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారమే ఆగకుండా సాగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వీరిద్దరూ చాలా కాలం తర్వాత జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ముందు ఈ జంట బృదావనం, బాద్షా చిత్రాల్లో నటించారు.
ఈ సినిమాకు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో మొరాకోకు చెందినా మోడల్ నారా ఫతేహీ ఒక ఐటెం సాంగులో కనిపిస్తుంది. ఈ పాట ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ కాబోతుందని నిర్మాత అభిప్రాయం. ఈ పాట దుమ్ము రేపితీరుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇలా ఉండగా, ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ రచయిత వక్కంతం వంశీ కథను సమకూర్చారు. కథ వినీవినడంతోనే ఈ సినిమాపై బోలెడు ఆశలు పెంచుకున్న వంశీ నెల్లూరు ఏరియా రైట్స్ ని రెండు కోట్లతో సొంతం చేసుకున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.