ఆటో డ్రైవర్ గా ...

ప్రముఖ సంగీత దర్శకుడు జీ వీ ప్రకాశ్ నటుడిగా కనిపించబోతున్నారు. “నాకు ఇంకో పేరుంది” అనే ద్విభాషా చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చితంలో ఆనంది ఆయన సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు సామ్ అంటోన్.

ఈ చిత్రంలో జీ వీ ప్రకాశ్ ఆటో డ్రైవర్ గా నటిస్తున్నారు. అతని క్యారక్టర్ పేరు జానీ. ఇదొక యాక్షన్ డ్రామా కథనం. ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదల అయ్యింది. చిత్రీకరణ శరవేగంతో సాగుతోంది. దాదాపుగా ముగింపు దశలో ఉంది షూటింగ్ భాగం.

నిర్మాత మాట్లాడుతూ క్లైమాక్స్ సన్నివేశాలు మిగిలి ఉన్నాయని, ఆ సన్నివేశాలు చెన్నైలో చిత్రీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. గతంలో జీ వీ ప్రకాశ్, సామ్ అంటోన్ కలిసి ఓ తమిళ చిత్రానికి పనిచేసారు. ఆ చిత్రం పేరు డార్లింగ్.

ఇప్పుడు ఆటో డ్రైవర్ గా వెండితెరపై కనిపించబోతున్న జీ వీ ప్రకాశ్ ఈ చిత్రానికిసంగీతం కూడా సమర్పిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.