ఆత్మవిశ్వాసం ఉన్న వాడిని

మ్యాన్ ఆఫ్ యాక్షన్ బోయపాటి శ్రీనుకు చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు ఉంది. కమర్షియల్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న బోయపాటి శ్రీను విజయవంతంగా నడుస్తున్న లెజెండ్ (బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం) తో తన ట్రేడ్ మార్క్ ను మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ చిత్రం సక్సెస్ తో శ్రీనులో ఓ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీనితో తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్న శ్రీను తన శక్తిసామర్ధ్యాలపై ఎంతో నమ్మకం ఉందన్నారు. లెజెండ్ విజయం సాదిస్తుందని తాను విడుదలకు ముందే ఒక నిర్ణయానికి వచ్చానని అన్నారు.
“ఇప్పటి వరకు ఒక్క ప్రేమకథా చిత్రానికీ దర్శకత్వం వహించలేదు కదా …ఎందుకు” అని అడిగినప్పుడు “అలా అనుకోవడం సరి కాదు. నా ఫిలిం భద్ర పూర్తిగా ఒక ప్రేమ కథ” అని అన్నారు.
భద్రను యాక్షన్, హింస చిత్రంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు…కానీ అదొక అందమైన ప్రేమ కథా చిత్రమని బోయపాటి చెప్పారు.
నిర్మాతలు తనను ఒక డైనమిక్ దర్శకుడిగా అనుకోవడం తన అదృష్టమని, వారి మాటలను దీవెనలుగా అనుకుంటానని తెలిపారు.
నా చిత్రాలకు నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తారని, అటువంటప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదు కదా అని అంటారు.
ప్రేక్షకులు తమ జీవితంలో చూడలేని సన్నివేశాలను తన చిత్రంలో ఆశించేటప్పుడు తాను వారి ఆశలు నీరుకార్చక మంచి చిత్రాలు రూపొందించడం తన బాధ్యతని అన్నారు.
బాలయ్యలాంటి పవర్ఫుల్ హీరో నటించే చిత్రాలలో అభిమానులు మంచి మసాలా ఆశిస్తారని, అది దృష్టిలో పెట్టుకునే తాను లెజెండ్ అందించానని, అదే తన విజయానికి మూల సూత్రమని బోయపాటి శ్రీను చెప్పారు.

Send a Comment

Your email address will not be published.