ఆస్ట్రేలియా ప్రియుడు

Ileanaప్రముఖ నటి ఇలియానా పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి విషయాన్ని ఎంతో గుట్టుగా ఉంచాలనుకుంది. తీరా, విషయం తెలియనే తెలిసింది. ఇలియానా ప్రియుడి పేరు ఆండ్రూ నీబోన్.
ఆమె చాలాకాలంగా తన ప్రేమికుడి గురించి ట్విట్టర్ లో ఏదో ఒకటి రాస్తూనే వచ్చింది. అప్పుడే ఆమె అతనిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. సముద్ర తీరంలో రకరకాల డ్రెస్సులతో తన ప్రియుడితో ఫోటోలు తీయించుకుంది. ఇదంతా ఇలా ఓవైపు జోరుగాసాగుతున్న తరుణంలోనే ఆమె అకస్మాత్తుగా టూరుకి వెళ్ళింది. అప్పుడే కొందరికి అనుమానాలు వచ్చాయి.

ఈమధ్య ఒక సినిమా సక్సెస్ పార్టీలో వాళ్ళూవీళ్ళూ మాట్లాడుతూ మధ్యలో ఇలియానా గురించి కూడా మాటలు వచ్చాయి. తీరా ఏమిటని వాకబు చేస్తే ఆమె హానీమూన్ కి వెళ్లినట్టు తేలింది. అసలు ఇలియానాకి ఈ ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడో పెళ్లి అయినట్టు తెలియవచ్చింది. ఇలియానా పెళ్లి వీడియోని కూడా ఒకరిద్దరు పక్క వారితో షేర్ చేసుకున్నారట. ఆండ్రూతో చేసుకున్న పెళ్ళికి ఇలియానా అతికొద్ది మందిని మాత్రమే పిలిచిందట
ఆ మధ్య దాదాపు ఏడాదిన్నర పాటు చిత్రాలు లేకుండా ఖాళీగా ఉన్న తర్వాత ఆమె నటించిన ‘రుస్తుం’ సినిమా విజయవంతం కావడంతో బాలీవుడ్‌లో ఇలియానాకు తిరిగి గిరాకీ పెరుగుతున్నట్టు తెలిసింది. ఒకవేళ తనకు పెళ్లైనట్టు తెలిస్తే ఈ గిరాకీ తగ్గిపోతుందేమో అనే సందేహం వల్లే ఇలియానా పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచినట్టు ఓ సమాచారం.

Send a Comment

Your email address will not be published.