ఇంతత్వరగా నటిస్తానని అనుకోలేదు!

seerat kapoorసీరత్ కపూర్ మళ్ళీ వెండితెరపై మనముందుంటుంది. చివరిసారిగా కొలంబస్ అనే చిత్రంలో కనిపించిన ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో రాజుగారి గది – 2 తో కనిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ అప్పుడు తానేమీ నెర్వస్ గా ఫీలవలేదని చెప్పిన సీరత్ కపూర్ హాయీగా ఫీలైనట్లు తెలిపింది. ఎంతో ఆనందంగా చిత్రీకరణలో పాలల్గొన్నానని పేర్కొంది.

సీరత్ మాట్లాడుతూ ఓ చిత్రానికి మరో చిత్రానికి మధ్య ఎక్కువ టైమ్ గ్యాప్ వచ్చినందుకు తానేమీ టెన్షన్ ఫీలవలేదని చెప్పింది. ఎవరైనా టైమ్ విషయంలో భయపడి ఉండొచ్చు. కానీ తానేమీ అలా భయపడలేదని తెలిపింది. ఎప్పుడైనా ఓర్పు మంచి ఫలితాన్నే ఇస్తుందని చెప్పింది. తనకు నచ్చిన సినిమాయే చేయాలని ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ టైమ్ గ్యాప్ అనేది చోటుచేసుకుందని ఆమె చెప్పింది. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జునతో కలిసి ఈ చిత్రంలో నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని తాను ఊహించలేదన్నది. ఎందుకంటే ఆయన గొప్ప నటుడని, కెరీర్ లో ప్రతి ఒక్కరికి ఏదో దశలో ఓ మలుపు అనేది ఉంటుందని తాను నమ్ముతానని ఆమె చెప్పింది. తాను సమయమున్నప్పుడల్లా తన నైపుణ్యాన్ని తీర్చి దిద్దుకోవడానికి కృషి చేస్తుంటానని తెలిపింది.

ఈ రాజుగారి గది – 2లో తన పాత్ర ఎంతో ఆసక్తికరమైనదని, దానిని ఇప్పటికిప్పుడు చెప్పబోనని, అభిమానులు ఈ చిత్రం వెండితెరపై చూసి తెలుసుకోవాలని సీరత్ చెప్పింది.

తాను ఇటీవల ఓ ఫోటో షూటింగ్ లో ఓ అత్యాధునిక దుస్తుల్లో కనిపించినప్పుడు కొందరు ఏవేవో రాశారని, హద్దులు మీరానని రాశారు. కానీ తానలా అనుకోనని, ఒక్కో సందేశానికి ఒక్కోలా తయారుకావాల్సి ఉంటుందని, అది సందేశానికి ప్రతీకే తప్ప అక్కడ మిగతా అంశాలు ప్రధానం కాదని చెప్పింది. ఏదైనా చూసే కళ్ళను బట్టి ఉంటుందని అంది సీరత్ కపూర్.

Send a Comment

Your email address will not be published.