ఆమెకు త్వరలో మూడు ముళ్ళు వేయించడానికి ఇలియానా పెద్దలు చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు బలం చేకూర్చేవిధంగా ఆమె కొత్తగా ఏ సినిమాకు ఒప్పందం కూడా చేసుకోలేదు.
ఆమె నటించిన మెయిన్ తేరా హీరో చిత్రం ఇటీవలే విడుదలైంది.
టాలీవుడ్లో కొన్ని ఫ్లాప్ లతో ఆమె ఆ మధ్య తన దృష్టిని బాలీవుడ్ పై మళ్ళించింది. అక్కడ బర్ఫీతదితర హిట్ చిత్రాల్లో నటించింది.వాటిలో ఓ రెండు సినిమాలు సూపర్ హిట్టే. కానీ ఆతర్వాత ఎందుకనో ఆమెకు కొత్త సినిమాలు రాలేదు. దీనితో ఆమె కుటుంబ పెద్దలు ఇలియానాకు పెళ్లి చేసేస్తే మంచిదని ఆలోచించారు. ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కనుక ఆమె త్వరలో మూడు ముళ్ళు వేయించుకుని వెండితెరకు గుడ్ బై చెప్తారని అనుకుంటున్నారు.