ఉగాదికి పవన్ సినిమా

katama Rayuduపవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు బహుళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చిత్రీకరణలు జరుగుతున్నాయి. అయితే ముందుగా థియేటర్ కు రానున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ స్టుడియోలో జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకులు డాలీ. పవన్ కళ్యాన్ మిత్రుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2017 వ సంవత్సరంలో మార్చ్ 27 వ తేదీన ఈ చిత్రం విడుదల అవుతుంది. యూనిట్ వర్గాల మేరకు ఈ చిత్రం ఉగాది నాటికి విడుదల అవుతుంది. ఈ చిత్రంలో పవన్ పాత్ర ఓ ఫాక్షనిస్ట్. కథ అతని ప్రేమ చుట్టూ తిరుగుతుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

ఇలా ఉండగా, పవన్ కళ్యాన్ నిర్మాత ఏ ఏం రత్నంతో కలిసి మరో చిత్రం కూడా ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. వచ్చే సాధారణ ఎన్నికల లోపు పవన్ కళ్యాన్ మూడు సినిమాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

Send a Comment

Your email address will not be published.