నాగ శౌర్య, రాశి ఖన్నా జంటగా నటించిన “ఊహలు గుస గుస లాడే” చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల కూడా ఒక పాత్ర పోషించారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కల్యాణి కోడూరి సంగీతం సమకూర్చారు.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ వర్క్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది.
నిర్మాత సాయి కొర్రపాటి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈమధ్యే తమ చిత్రం తాలూకు ఆడియో ఆవిష్కరించినప్పుడు మంచి స్పందనే లభించిందని అన్నారు. కల్యాణి కోడూరి ట్యూన్స్ అటు యువతనే కాకుండా ఇటు పెద్దలను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు. చిత్రం తుది అవుట్ పుట్ బాగా వచ్చిందని, తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని ఆయన అన్నారు.
శ్రీనివాస్ అవసరాల వర్క్ తనకెంతో నచ్చినట్టు చెప్పిన సాయి సెన్సార్ బోర్డు తమ చిత్రానికి “యు” సర్టిఫికేట్ ఇచ్చిందని అన్నారు.
సకుటుంబ కథా చిత్రంగా ఇది అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని, నాగ శౌర్యకు ఇది మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.