ఎంత వరకు నటించవచ్చో తెలుసు

శ్వేతా మీనన్ పేరు చెప్పగానే అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పటికి ఆమె మళయాళ చిత్రాలలో నెంబర్ వన్ హీరోయిన్ అని. రతీనిర్వేదం అనే చిత్రంలో ఆమె నటించిన తీరు కొన్ని విమర్శలకు తావిచ్చింది కూడా. ప్రసవ సన్నివేశంలో ఆమె నేరుగా నటించడంతో కొందరు వ్యాఖ్యలు చెయ్యకపోలేదు.

ఇలా ప్రసవ సన్నివేశంలో నటించినది పేరు కోసమేగా అని అడగ్గా అలాంటిదేమీ లేదని ఆమె జవాబిచ్చారు. ఒక నటిగా ఏ మేరకు కనిపించవచ్చో చూపించవచ్చో తనకు బాగానే తెలుసునని, ఆ హద్దు ల మేరకే తాను నటించానని శ్వేతా మీనన్ చెప్పారు. అయినా సెన్సార్ బోర్డు ఉండనే ఉంది కదా ఒక వేళ నటించే సన్నివేశం అభ్యంతరకరమైతే కట్ చెయ్యడానికి అని అంటూ అదొక కుటుంబ చిత్రమని ఆమె అన్నారు. సినిమాకు అవసరమైన సన్నివేశం కనుకనే తాను నటించానని చెప్పారు. కొందరు అనవసరంగా ఏవేవో విమర్శలు చేసారని, తీరా సినిమా చూసిన వాళ్ళల్లో ఒక శాతం మంది కూడా వ్యతిరేకించలేదని ఆమె తెలిపారు. అందుకే మన భారత దేశంలో ఏ మేరకు నటించవచ్చో అందరికి తెలిసిన విషయమే తప్ప తాను ప్రత్యేకించి ఏమీ చెప్పక్కర లేదు అని శ్వేతా మీనన్  ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

Send a Comment

Your email address will not be published.