ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది?

ఇటీవలే “సాహసం శ్వాసగా సాగిపో” అనే ఓ పాటల ఆల్బం హైదరాబాదులో ఘనంగా విడుదల అయ్యింది. ఈ కార్యక్రమం ఓ సంగీత కార్యక్రమంలా ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ఈ పాటలకు సంగీతం స్వరపరిచింది ఏ ఆర్ రెహ్మాన్.

నాగ చైతన్య, మంజిమా మోహన్, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రహ్మాన్ సంగీత సారధ్యంలో గాయనీగాయకులు ఓ ఇరవై నిముషాలు పాటలు పాడి వినిపించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ఈ “సాహసం శ్వాసగా సాగిపో” ఆల్బం మనల్ని ఎక్కడికో తీసుకుపోయిందని, తానూ ఈ పాటలను తన మ్యూజిక్ రూంలో ఒక్కడినే విన్నానని, కాస్సేపు తర్వాత అమల వచ్చి “ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది?” అని అడిగేంత వరకు తానూ ఏడుస్తున్నాను అనే విషయమే తెలియలేదని అన్నారు. ఈ ఆల్బం లో ప్రత్యేకించి వెళ్లి పోమాకే …అని సాగే పాట తనని కలచి వేసిందని, ఇది చాలా గొప్ప పాటని అన్నారు.

కార్యక్రమం చివర్లో ఏ ఆర్ రెహ్మాన్ ప్రతి ఒక్కరి మాట మన్నించి సిడీలపై సంతకం చేసివ్వడం విశేషం

Send a Comment

Your email address will not be published.