ఎనిమిది కోట్లు అడ్వాన్స్

ప్రిన్స్ మహేష్ బాబు అడ్వాన్స్ గా ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నారు. అంత మొత్తం ఇచ్చిన నిర్మాత మరెవరో కాదు…భవ్య క్రియేషన్స్ అధినేత వీ ఆనంద్ ప్రసాద్.

ఆనంద్ ప్రసాద్ నిర్మించబోయే ఓ తెలుగు చిత్రానికి మహేష్ బాబుకి మొత్తం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆనంద్ ప్రసాద్ ఒప్పుకున్నారు. అందులో ఎనిమిది కోట్లు ఇప్పటికే ఇచ్చేసినట్టు అభిజ్ఞ వర్గాల భోగట్టా. ప్రస్తుతం ఆగడు చిత్రంలో ఒక పాట చిత్రీకరణ కోసం విదేశంలో ఉన్న మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోరట్ల శివ సారధ్యంలో చేసేందుకు ఒప్పుకున్నారు. ఆ కొత్త ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఆనందప్రసాద్ నిర్మించే చిత్రంలో ఆయన నటిస్తారు.

ప్రస్తుతం ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. ఆ చిత్రానికి దర్శకులు శ్రీవాస్.

Send a Comment

Your email address will not be published.