ఎన్టీఆర్ పాత్రలో నానీ...

naniమహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ లో త్వరలో ఓ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నిర్మాత స్వప్న దత్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తాలూకు చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావులపై చిత్రీకరించవలసి ఉన్న ఒకటి రెండు సన్నివేశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. దేవదాస్, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కథ, సంసారం వంటి అనేక చిత్రాల ఆధారంగానూ సావిత్రి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించడానికి నాగచైతన్య ఇప్పటికే అంగీకరించారని, అయితే ఎన్టీఆర్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కొందరు నటులతో ఇంకా చర్చలు సాగుతున్నాయని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే నానితోనూ ఈ విషయమై దర్శక నిర్మాతలు మాట్లాడనున్నట్టు తెలియవచ్చింది.

ఇలా ఉండగా, హైదరాబాదులోని ఓ స్టూడియోలో ఈ చిత్రంలోని ఓ పాట చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్టు కూడా సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రను పోషిస్తున్నారు. దల్క్వీర్ సల్మాన్ జెమినీగణేశ్ పాత్రలో నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.