ఎవడు రివ్యూ

రేటింగ్ : 3/5
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటులు : రామ్ చరణ్, అల్లు అర్జున్, రాహుల్ దేవ్, సాయి కుమార్, శృతిహాసన్, కాజల్, ఏమీ జాక్సన్, కోట శ్రీనివాస రావు  తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాత : దిల్ రాజు

సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా పండగ. పెద్ద పండక్కి పెద్ద హీరోల సినిమాలతో రాష్ట్రం లోని సినిమా హాళ్ళు కళకళ లాడుతుంటాయి.  అభిమానుల కోలాహలం మధ్య పండగ సరదాగా గడిచి పోతుంది. ఈ సందడికి మెగా హీరో రామ్ చరణ్, సూపర్ హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి,  మెగా నిర్మాత దిల్ రాజు తోడైతే  ఆ సంబరాలకి హద్దు ఉండదు. పోయిన ఏడాది నాయక్ తో మహేష్ బాబుకి  పోటీ ఇచ్చి బంపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఈసారి ఎవడు తో మహేష్ బాబు 1 కి మరో సారి పోటీ ఇచ్చాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతిధి పాత్ర లో కనిపించి  అభిమానుల్ని అలరించాడు.

కథ
ఎవడు సినిమా కథ అల్లు అర్జున్ ప్రేమతో ప్రారంభమవుతుంది. సత్య ( అల్లు అర్జున్), దీప్తి ( కాజల్) ప్రేమించు కుంటారు. వీరి ప్రేమకి అడ్డం వస్తాడు ధీరూ భాయ్ ( రాహుల్ దేవ్). దీప్తి  అందాన్ని చూసి ప్రేమ లో పడతాడు ధీరూ భాయ్. అయితే దీప్తి  అతని ప్రేమని తిరస్కరిస్తుంది. సత్య తో ఆమె  పీకల్లోతు  ప్రేమలో కూరుకు పోతుంది. తన ప్రేమ కి అడ్డంగా ఉన్న సత్యని చంపాలనుకుంటాడు ధీరూ. అయితే ధీరుభాయ్ తో గొడవ పడకుండా వారి ప్రేమని బతికించు కోడానికి  హైదరాబాద్ నుంచి  పారి పోతారు సత్య, దీప్తి.

అయితే పారిపోతున్న  వారి పై ఎటాక్  చేయిస్తాడు ధీరూ భాయ్. ఆ దాడి లో దీప్తి ప్రాణాలు కోల్పోతుంది. కొన ఊపిరితో   ఉన్న సత్య కూడా చని పోయాడని భావించి దుండుగులు వదిలేస్తారు. ముఖమంతా కాలి పోయి, తీవ్ర గాయాలతో, కొన ఊపిరి తో ఆస్పత్రి లో చేరిన సత్యని బతికిస్తుంది  ఒక డాక్టర్ ( జయసుధ ). సత్య కి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా  చరణ్ ( రామ్ చరణ్ )  పోలికలతో ప్రాణం పోస్తుంది. దీప్తిని తనకు దూరం చేసిన వారినందరినీ  చరణ్  చంపేస్తాడు. ఇక అందరూ చని పోయారు అనుకునే సమయానికి చరణ్ పై దాడి జరుగుతుంది. మరి చరణ్ పై దాడి చేసింది ఎవరు, వారితో చరణ్ కి ఉన్న పగ ఏమిటి అనేది అసలు కథ.

కళాకారుల పనితీరు
సత్య పాత్ర లో అల్లు అర్జున్ కనపడేది కాసేపే అయినా చాలా  బాగా చేసాడు. సినిమా కి కొత్తదనాన్ని తీసుకు వచ్చాడు. ఇక చరణ్  మాస్ ని  ఆకట్టుకునేలా డ్యాన్సులు, ఫైటింగ్ లతో అదర గొట్టాడు. ఫస్ట్ ఆఫ్ లో కనపడే కాజల్, సెకండ్ ఆఫ్ లో వచ్చిన శృతి చక్కని నటనతో తమ పాత్రలకి న్యాయం చేశారు. ఏమీ జాక్సన్ మాత్రం అందాల ఆరబోత కే పరిమితమయ్యింది.

రాహుల్ దేవ్, కోట శ్రీనివాస రావు, సాయికుమార్ లు విలన్ల గా హీరో ఇమేజ్  ని పెంచడానికి తమ వంతు కృషి చేశారు. బ్రమ్హానందం కామెడీ అంతంత మాత్రం గా ఉన్న ఎల్. బి. శ్రీ రామ్ మాత్రం ప్రేక్షకుల్ని బాగా నవ్వించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమా కి బాగా ప్లస్ పాయింట్ అయింది.

Send a Comment

Your email address will not be published.