ఎవరికి ఎవరు

కాలేజీ, రాజకీయ నేపధ్యంలో సాగే క్రైమ్ ప్రేమ కథతో ఎవరికి ఎవరు చిత్ర ప్రారంభోత్సవం మార్చి 31వ తేదీ ఉగాది పండగ రోజు హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియో లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ కొట్టగా  సి కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకుడుడాలీ అలియాస్ కిషోర్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కిషోర్ వెన్నెలకంటి మాట్లాడతూ అరుణ్, ఆర్య, ప్రజ్ఞ, సాయికుమార్, నాగబాబు, పోసాని కృష్ణమురళి తదితరులు  నటిస్తున్నారని చెప్పారు. సుభాష్ ఘై దగ్గర అనేక చిత్రాలకు వర్క్ చేసిన తాను దర్శకుడిగా చేస్తున్న తొలి చిత్రం ఇదేనని అన్నారు. ఈ చిత్రం కొత్తగా ఉంటుందనే నమ్మకం తనకుందని చెప్పారు.
రెగ్యులర్ షూటింగ్ చేపట్టి నలభై రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చెయ్యాలన్నది చిత్ర యూనిట్ ప్రణాళిక.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఈ రోజు వరకు తాను పద్నాలుగు చిత్రాల్లో పోలీస్ అధికారిగా నటించానని, ఈ చిత్రంలో ఏ సి పీ గా నటిస్తున్నానని అన్నారు. తన పాత్ర వైవిధ్యంతో కూడుకున్నదని ఆయన చెప్పారు.
ఈ చిత్రానికి  ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవికాంత్ కౌశిక్. సంగీతం చిన్నికృష్ణ. చాయాగ్రహణం జీ వెంకటేశ్వర ప్రసాద్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం కిషోర్ వెన్నెలకంటి.

Send a Comment

Your email address will not be published.