ఎవరి దారి వారిదే...!

Chiru Pawanమెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తమ కెరీర్ పై ఎవరి దారి వారిదే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు.

సోదరులిద్దరూ అటు సినిమాలలోను, ఇటు రాజకీయాలలోనూ ఉన్నవాళ్ళే. అయితే పవన్ కళ్యాన్ తణుకు సినీ పరిశ్రమ నుంచి తప్పుకుని రాజకీయాలలో ఉండాలని ఉందని వెల్లడిస్తే చిరంజీవి అందుకు భిన్నంగా ఆలోచించారు. మెగా స్టార్ తానూ మరిన్ని చిత్రాలు చేయాలని ఆశిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాతా 150 వ చిత్రంతో మళ్ళీ అభిమానుల ముందుకు వచ్చిన చిరు ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నటుడై ఉండి రాజకీయాలలోకి వెళ్లి ఇప్పుడు మళ్ళీ సినీ రంగంలోకి వచ్చిన చిరు మరింత కాలం టాలీవుడ్ లో ఉంటూ మరిన్ని చిత్రాలు చేయాలని అనుకుంటున్నారు. తన బావమరిది అల్లు అర్జున్, అశ్వినీదత్ లతో కలిసి మరికొన్ని చిత్రాలు చేయడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రాలకు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. తానూ జనం మధ్య ఉండాలంటే వెండితెరే మెరుగైన మార్గంగా చిరు భావిస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాన్ ఇలా చెప్పారు – “తదుపరి మూడు చిత్రాలూ పూర్తి చేసిన వెంటనే పూర్తి స్థాయిలో రాజకీయాలలో ఉండాలని ఉంది…” అని.

ఇప్పటికే జనసేన పార్టీతో ముందుకు సాగుతున్న పవన్ వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.