ఏఎన్నార్ ఎలా పోయారు?

ప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఎలా పోయారు? కొద్ది రోజుల క్రితం కన్ను మూసిన అక్కినేని క్యాన్సర్ కారణంగా కన్నుమూసినట్టు అంతా అనుకుంటున్నారు. నిజానికి ఆయనకు క్యాన్సర్ ఉన్నట్టు గత అక్టోబర్ మూడవ వారంలో బయటపడింది. దాంతో అంతా ఆయన క్యాన్సర్ తోనే చనిపోయినట్టు అనుకున్నారు. అయితే ఆయన చనిపోవడానికి కారణం క్యాన్సర్ కాదనీ, ఆయన కన్నుమూసింది గుండె పోటు కారణంగా అనీ ఆయన కుమార్తె నాగ సుశీల నేడిక్కడ బయటపెట్టారు. నిద్రలోనే ఆయనకు భారీ స్థాయిలో గుండె పోటు వచ్చిందని ఆమె తెలిపారు. అందుకనే ఆయన మృతదేహంలో ఆయన ముఖ కవళికలు ప్రశాంతంగా కనిపించాయని ఆమె చెప్పారు. క్యాన్సర్ ఉన్నా ఆయన మరికొన్ని సంవత్సరాలు బతికి ఉండేవారని, గుండె పోటు వల్లే ఆయన హఠాత్తుగా చనిపోయారని ఆమె చెప్పారు.

Send a Comment

Your email address will not be published.