ఏడు భాషల్లో...

Naa peru suryaఅల్లు అర్జున్ నటిస్తున్నతాజా చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రం ఏడు భాషల్లో విడుదల కాబోతోంది. ఇలా ఏడు భాషల్లో విడుదల చేయాలనుకున్న చిత్ర నిర్మాత బన్నీ వాస్ ఆలోచనకు చిత్ర యూనిట్ అంతా వెంటనే అంగీకరించినట్టు అభిజ్ఞవర్గాల మాట. ఈ చిత్ర కథ అందరికీ చెందినదని, ఎందరో ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించారని సన్నిహిత వర్గాల మాట.

అల్లు అర్జున్ చిత్రాలను ఇతర భాషలలోకి అనువదిస్తున్నప్పుడు వాటికి మంచి ఆదరణ లభిస్తోందని కూడా ఆ వర్గాల భోగట్టా.

దక్షిణాది భాషలైన తెలుగు, తమిశం, మలయాళంతోపాటు హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్ పురి భాషలలోనూ ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రం తాలూకూ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. కొన్ని పాటలూ, అలాగే కొన్ని సిన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయడానికి ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే తెలుగు ఫిల్మ్ చాంబర్ తో చర్చలు జరిపిన తర్వాత విడుదల తేదీని ఖాయం చేస్తారని తాజా సమాచారం. ఎందుకంటే ఆరోజున మరికొన్ని సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని విడుదల విషయంలో ఓ తుది నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.

Send a Comment

Your email address will not be published.