ఏదో చేసెయ్యాలి, కానీ ఏం చెయ్యాలి ?

ప్రముఖ కథానాయికగా  తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న సమంతా ఇప్పుడు ఏదో ఒకటి చేసెయ్యాలని ఆరాటపడుతోంది. జీవితంలోని అసంతృప్తిని ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తున్న సమంతా తనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలని ఆశిస్తోంది . కొన్నిరోజులుగా తన మనసులో నానుతున్న విషయమై ఆమె ఇప్పటికే ఒక సామాజిక సేవా సంస్థతో సంప్రదింపులు జరిపింది.

తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వెండితెరకు వచ్చి కథానాయికగా ఎదిగిన వాస్తవాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చెప్పుకునే సమంతా అనాధ పిల్లలకు, వరద బాధితులకు తనకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు తానే స్వయంగా ఒక సామాజిక సేవా సంస్థ ప్రారంభించి సేవా కార్యక్రమాలలో మరింత ఎక్కువగా పాలుపంచుకోవాలనుకుంటోంది. సమంతా ఆలోచన బాగానే ఉందిగా వినేందుకు.

Send a Comment

Your email address will not be published.