ఏమన్నా బాగుండా..

ఎక్కడ ఈమాట వినపడ్డా రాయల సీమ వాసుల మొహం విప్పారుతుంది. అందుకు కారణం ఆ యాస. ఇప్పుడు ఈ మాండలీకంతో రికార్డులు సృష్టించడానికి సిద్ధమై పోయారు. దూకుడు లో ఏందిబే … దిమాక్ కరాబ్ అయిందా అంటూ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి సరికొత్త సంచలనాలు సృష్టించాడు ప్రిన్స్ మహేష్. శ్రీను వైట్ల, మహేష్ బాబు ల కాంబి నేషన్ లో వచ్చిన దూకుడుకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. రెండేళ్ళ తర్వాత తిరిగి ఇదే కాంబి నేషన్ మన ముందుకు రానుంది. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ మహేష్ బాబు రాయల సీమ మాండలీకంలో మాట్లాడటం. ఈ సినిమాకి ‘ఆగడు’ అనే టైటిల్ ఖరారైంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం లాంచనంగా మొదలైంది. ఇందులో మొదటిసారిగా మహేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరో వారం రోజుల్లో మొదలు కానుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారని సమాచారం. మొదట ఈ సినిమాలోని ఒక కీలక పాత్రకి నటుడు శ్రీహరిని అనుకున్నా అతని హటాత్ మరణంతో ఆ స్థానంలో సీనియర్ నటుడు సాయికుమార్ ని తీసుకున్నారు. మిగిలిన ముఖ్య పాత్రలని ముందుతరం హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, తమిళ నటుడు నెపోలియన్ పోషిస్తున్నారు. ఈ సినిమాని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు నిర్మిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.