
ఆమె సినీ కెరీర్ తమిళంతోనే ఆరంభమైంది.
ఆమెకు ప్రస్తుతం తెలుగు, కన్నడం, మలయాళం భాషలలో ఆఫర్లు ఉన్నాయి. నటిస్తున్నారు కూడా. అయితే తమిళంలో అవకాశాలు ఉన్నాయి కానీ తనకు నచ్చిన కథ లేవని ప్రియమణి అన్నారు.
బాలీవుడ్ లో ఐటెం డ్యాన్సు చేసినా తమిళంలో చేయను గాక చేయనని గట్టిగా చెప్పారు. బాలీవుడ్లో చేయడం వేరు. దక్షిణాదిలో చేయడం వేరు అంటూ ఇప్పటికైతే సౌత్ లో ఐటెం డ్యాన్సు చేయనని ఆమె స్పష్టం చేసారు.
కొన్ని రోజుల క్రితం మరణించిన సినిమాటోగ్రాఫర్ బాలుమహేంద్ర మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. బాలూ మహేంద్ర తనకు తండ్రిలాంటివారు అని చెప్తూ తనకు చిత్ర జగత్తులో తొలి గురువు భారతి రాజా అయితే మలి గురువు బాలూ మహేంద్ర అని అన్నారు. తనకు మేకప్ లేకుండా నటించడం నేర్పింది బాలూ మహేంద్ర అని ఆమె గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం తనకు నచ్చిన కొత్త హీరొయిన్ లలో ఫలానా వారు అని ప్రత్యేకించి చెప్పలేనని, ఎందుకంటే అందరు తనకు స్నేహితులేనని తెలిపారు. భావనా, శ్రుతిహాసన్, కాజల్ ఇలా అందరూ తనకు ఇష్టమైన తారలేనని అంటూ తమన్నా మొబైల్ నంబర్ మారడంతో కొంత గ్యాప్ వచ్చిందని ప్రియమణి అన్నారు.
పత్రికలవారు గుసగుసలు పుట్టిస్తూ ఉంటారని, తాను పృధ్వీరాజ్ తో అయిదు చిత్రాలు చేసానని. ఆయన మంచి నటుదు అని చెప్పగానే తన మీద గుసగుసలు మొదలయ్యాయని, పృధ్వీరాజ్ పెళ్లి హాయిగా కుటుంబ జీవితం గడుపుతున్న మంచి వ్యక్తి అని ఆమె అన్నారు. అయినా ఎవరు ఎన్ని గుసగుసలు చెప్పుకున్నా రాసినా ఇప్పట్లో ప్రేమా, పెళ్లి లేవని ప్రియమణి తెలిపారు.