ఐటెం సాంగ్స్ కి దూరం!

ఈమధ్య విడుదలై దూసుకుపోతున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ చేసిన కాజల్ ఇప్పుడిక అలాంటి సాంగ్స్ కి నో చెప్తోంది.

జూనియర్ ఎం టీ ఆర్ తో ఉన్న పరిచయం వల్ల జనతా గ్యారేజ్ లో ఐటెం చేసిన కాజల్ కు డిమాండ్ పెరిగింది. ఆ పాటకు ఆమెకు బాగానే ముట్టాయి డబ్బులు. ఆ తర్వాత ఆమెకు మరెన్నో ఐటెం సాంగ్స్ కి ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె చేయడానికి ఒప్పుకోలేదు.

మరెందుకు జనతా గ్యారేజ్ చిత్రానికి ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారని ఓ చర్చ జరగగా అప్పట్లో ఆమె చిత్రాలు అంతగా విజయవంతం కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆ పాటకు కాజల్ ఒప్పుకోవలసి వచ్చినట్టు తెలిసింది. పైగా ఎం టీ ఆర్ తో ఉన్న పరిచయం కూడా ఓ కారణం అయ్యింది.

ఇప్పుడిక ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రంలో ఆమె ప్రధాన పోషిస్తున్నారు. ఆ చిత్రం పేరు ఖైదీ 150. అలాగే తేజ దర్శకత్వంలో వస్తున్న మరొక చిత్రంలో ఆమె దగ్గుబాటి రానా సరసన నటిస్తున్నది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కావస్తోంది.

Send a Comment

Your email address will not be published.