ఐటెం సాంగ్స్ కు క్రేజ్

itemsongటాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు క్రేజ్ మళ్ళీ పెరిగింది. నిర్మాతలు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి ఐటెం సాంగ్స్ కి ఒప్పిస్తున్నారు. తారలు కూడా పచ్చ జెండా చూపుతున్నారు. ఓ నాలుగు రోజుల చిత్రీకరణకు భారీమొత్తంలో గిడుతోందట. ఆ సొమ్ము ఓ చిత్రంలో కథానాయికగా నటించే తార తీసుకునే సొమ్ము కాస్తంతే అటూ ఇటుగా ఉంటోందట!

పంపిణీదారులు తీసుకొస్తున్న ఒత్తిడి వల్ల ఓ ప్రముఖ తారతో ఓ ఐటెం సాంగ్ చేయించక తప్పడం లేదని నిర్మాతలు చెప్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ ఐటెం సాంగ్ తప్పడం లేదట!
బాలీవుడ్ లో ఈ ఫార్ములా బాగానే కలిసొస్తోందట నిర్మాతలకు.

అభిజ్ఞ వర్గాల మేరకు తెలిసిందేమిటంటే తమన్నా దాదాపు 75 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట జాగ్వార్ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కి.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ఐటెం సాంగ్ కి ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉందని, ఆ పాట సినిమాను ఎక్కడికో తీసుకుపోతుందని చెప్పారు.

ఐటెం సాంగ్ కి ఓ ప్రముఖ నటిని ఎంపిక చేసినప్పుడే ఆ చిత్రానికి లభించే ప్రచారం అంతా ఇంతా కాదట!

కొన్నిసార్లు పంపిణీదారులూ, ఎగ్జిబిటర్లూ ఓ ప్రత్యేకమైన పాట కోసం ఓ ప్రముఖ తారతో తమతో సంతకాలు చేయించడానికి ఒత్తిడి చేస్తారని ఆయన అన్నారు.

ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన ఓ పాట కోసం శృతి హాసన్ ను ఒప్పించి దాదాపు నలభై లక్షల రూపాయలు ఇచ్చుకున్నట్టు తెలిపారు.

ఇటీవల విడుదల అయిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జనతా గ్యారేజ్ లో కాజల్ అగర్వాల్ తో ఓ ఐటెం సాంగ్ చేయించడానికి నిర్మాతలు దాదాపు యాభై లక్షల రూపాయలు ఇచ్చేరట!

ఆ పాట చిత్రానికే హైలైట్ అయ్యింది కూడా.

దర్శకుడు కోరట్ల శివ మాట్లాడుతూ, తానూ అలాంటి పాటలను ఐటెం సాంగ్ అననని, స్పెషల్ సాంగ్ అని అంటానని అన్నారు. దానిని ఓ డీసెంట్ సాంగ్ గా తానూ హైలైట్ చేస్తానని చెప్పారు. అందుకే తాను ఓ ప్రముఖ తారను ఆ ప్రత్యేకమైన పాటకు ఎన్నుకోమని నిర్మాతలతో చెప్పానని అన్నారు.

జాగ్వార్ చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుని భారీగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని తమన్నా చెప్పింది. అంతకుముందు ఆమె అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే కదా!

ఈ రెండు చిత్రాలలో ఆమె ఐటెం సాంగ్స్ చేయడానికి దాదాపు కోటి రూపాయల వరకు డిమాండ్ చేసిందట! తన కొడుకు అల్లుడు శీను నటించిన చిత్రంలో ఆమెతో నటింప చేయడానికి బెల్లంకొండ సురేష్ దాదాపు కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడట. అయితే ఆ చిత్రం అనుకున్న టైం కి ప్రారంభం కాకపోవడంతో ఆమె ఆ రెండు చిత్రాలలో ఐటెం నంబర్స్ చేయడానికి ఒప్పుకుందట.

ప్రముఖ తారలు కథానాయికలుగా నటించే చిత్రాలలో హంస నందిని, ముమైత్ ఖాన్ తదితర రెగ్యులర్ ఐటెం గర్ల్స్ 20 నుంచి 30 లక్షలవరకు డిమాండ్ చేస్తారని, అయితే ప్రముఖ తారలు అదే ఐటెం సాంగ్ చేస్తే వారికి యాభై లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదట నిర్మాతలు అని ఓ సన్నిహిత వర్గాల మాట!

Send a Comment

Your email address will not be published.