ఐటెం సాంగ్ లో నయనతార

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం లింగ షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ తాజా వార్త వెలువడింది. చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ జంటగా నటించిన నయనతార లింగా చిత్రంలో ఒక పాటలో కనిపించబోతోంది. అది కూడా మామూలు పాట కాదు. ఐటెం సాంగ్ అట. ఈ ఐటెం సాంగ్ లో నటించేందుకు నయనతార ఒప్పుకుందట. ఒక ఐటెం సాంగ్ లో ఆమె కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. “ఐటెం సాంగ్ లో నటించేందుకు మీరు ఎందుకు ఒప్పుకున్నారని” విలేఖరులు అడగ్గా “అది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కావడం వల్లే” అని జవాబిచ్చింది నయనతార. ఈ చిత్రంలోనే తమిళ కామెడి స్టార్ సంతానం కూడా నటించబోతున్నాడు. చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ తో కలిసి నటించిన మరో కామెడీ స్టార్ వడివేలు కూడా ఈ లింగా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.