ఐటెం సాంగ్ లో శృతి హాసన్, తమన్నా

సినిమాల్లో ఐటెం సాంగ్ సంగతి మామూలే అయినా స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్ చేయడం వాడుకైపోతోంది ఈ మధ్య కాలంలో …

మన టాలీవుడ్ పరిశ్రమలో మామూలు కథానాయికలు ఐటెం సాంగ్ చేస్తే రెండు లక్షల రూపాయల నుంచి అయిదు లక్షల వరకు తీసుకుంటారు. అయితే పేరున్న స్టార్ హీరోయిన్స్ రేటే వేరు. వాళ్ళు కనీసం పది లక్షలు తగ్గకుండా పుచ్చుకుంటారు. అదే బాలీవోడ్ లో అయితే స్టార్ హీరోయిన్స్ కోట్లలో తీసుకుంటారని భోగట్టా.

టాలీవుడ్ లో బిజీగా ఉన్న అగ్రశ్రేణి తారలు శ్రుతి హాసన్, తమన్నాలు మొదటిసారి ఐటెం సాంగ్ లు చేసినప్పుడు ఆయా చిత్రాలకోసం యాభై లక్షల రూపాయల వరకు తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల మాట. ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఆగడు సినిమాలో నిజానికి కథానాయిక తమన్నా…. అయితే ఈ చిత్రంలో శృతి హాసన్ తో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ అనుకుంది. అనుకున్నట్టే శ్రుతిహాసన్ ను ఆ ఐటెం సాంగ్ కి ఎంపిక చేసారు. మహేష్ బాబుతో కలిసి మూడు రోజుల పాటి నర్తించడానికి ఆమె యాభై లక్షల రూపాయలు అడిగినట్టు తెలిసింది. ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడుతోంది.

ఇక అల్లుడు శ్రీను సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేసారు. నిజానికి ఈ చిత్రంలోనూ కథానాయిక మరొకరు. తమన్నా కేవలం ఒక్క సాంగ్ కే పరిమితం. ఆ ఐటెం సాంగ్ కి ఆమె కూడా శృతి హాసన్ తీసుకున్నంత తీసుకుందని సమాచారం. అల్లుడు శ్రీను చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించగా ఆయన కుమారుడు సాయి శ్రీనివాస్ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.

Send a Comment

Your email address will not be published.