ఐదుకి అయిదు మార్కులు

మా అబ్బాయి అఖిల్ నటనకు ఐదుకి అయిదు మార్కులు వేస్తున్నాను అని అక్కినేని నాగార్జున అన్నాడు.

అఖిల్ టైటిల్ రోల్ లో నటించి విడుదల అయిన అఖిల్ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగార్జునతోపాటు అఖిల్, నిర్మాత నితిన్, దర్శకుడు వీ వీ వినాయక్ తదితరులు హాజరయ్యారు.

అఖిల్ చిత్రంపై మీడియాలో భిన్న విమర్శలు వచ్చాయి. కానీ ఆ విమర్శలు ఎలా ఉన్నా నాగార్జున మాట్లాడుతూ తన కుమారుడి చిత్రం అఖిల్ చూస్తుంటే గర్వంగా ఉందని అన్నాడు.

తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు ఉన్నట్టు వచ్చిన వదంతులను నాగార్జున కొట్టిపారేశాడు. అఖిల్ సినిమా వాయిదా పడినప్పుడు అఖిల్ అప్సెట్ అయినట్టు వచ్చిన వార్తలను నాగార్జున తిరస్కరించాడు. మా ఫ్యామిలీ స్టుపిడ్ ఫ్యామిలీ కాదని నాగార్జున చెప్పాడు. చిన్న చిన్న విషయాలకు అప్సెట్ అయి విభేదాలతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ తమది కాదన్నాడు నాగార్జున. కొన్ని సార్లు తనకు కోపం వచ్చినా తన కొడుకులకు కోపం రానేరాదని చెప్పాడు. తాము హ్యాపీగానే ఉన్నామని, తమది ముచ్చటైన హ్యాపీ ఫ్యామిలీ అని అన్నాడు. అఖిల్ చిత్రం పట్ల సంతృప్తి, సం తోషాన్ని వ్యక్తం చేస్తూ చాలామంది అఖిల్ తో మాట్లాడి విష్ చేసారని, తనకూ, అమలకూ ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున చెప్పాడు. అఖిల్ మొదటి సినిమా పట్ల నాగార్జున ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసాడు.

అఖిల్ తన మొదటి చిత్రంతోనే బీ , సి కేంద్రాల ప్రేక్షకులను సైతం చేరుకున్నాడని, తాను ఒక నటుడిగా కాకుండా మొదటిసారిగా నటించిన నటుడిగా అఖిల్ కి వంద శాతం మార్కులు వేస్తానని చెప్పాడు. అతని పెర్ఫార్మన్స్ చాలా బాగుందని, అతని డ్యాన్స్, నటనలో ప్రతిభ తననెంతో ఆకట్టుకున్నాయని అన్నాడు. అమల ఒక చక్కటి క్లాసికల్ డ్యాన్సర్ అని, బహుశా ఆ జీన్స్ అఖిల్ డ్యాన్స్ లో ఉండి ఉండవచ్చని నాగార్జున అన్నాడు.

అఖిల్ చిత్రాన్ని గత బుధవారం నాడు చూసిన తర్వాత ఇంట్లో ఆ చిత్రం గురించి మాట్లాడుకున్నామని, తన సినిమాలు చూసినప్పుడు అఖిల్ అక్కడక్కడా అలా ఇలా ఉండవచ్చని కొన్ని అంశాలు చెప్తుంటాడని, ఇప్పుడు తానూ అఖిల్ కి కొన్ని అంశాలు చెప్పాల్సి ఉందని నాగార్జున అన్నాడు.

ఏ నటుడికైనా తాను చేయవలసిన పాత్రకు సంబంధించి డిక్షన్ చాలా ప్రధానమని మా నాన్న (అక్కినేని నాగేశ్వర రావు) అంటూ ఉండేవారని, అదృష్టం కొద్దీ అఖిల్ వాయిస్ మంచి వాయిస్ అని నాగార్జున అన్నాడు. అఖిల్ తన వాయిస్ ని సరిగ్గా వినియోగించుకుంటే అది అతనికి ప్లస్ పాయింట్ అవుతుందని సూచించాడు.

Send a Comment

Your email address will not be published.