ఐషా స్థానంలో రాశి ఖన్నా

కారణాలు తెలీదు కానీ ఎందుకనో ఐషాను  కాదని రాశి ఖన్నాతో షూటింగ్ కొనసాగిస్తున్నట్టు “శివం” చిత్ర నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్నారు. ఐషాతో షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఎందుకనో ఆమెను పక్కకు తప్పించి రాశిని తీసుకున్నారు. తాత్కాలికంగా ఈ సినిమా టైటిల్ “శివం” అని నామకరణం చేసారు. ఆ తర్వాత ఈ టైటిల్ మారొచ్చు మారకపోవచ్చు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

మరోవైపు రామ్ పోతినేని ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఈ “శివం”  చిత్రం ఒకటి.

అతను నటిస్తున్న పండగ చేసుకో సినిమా త్వరలో విడుదల కానున్నది. పండగ చేసుకో సినిమా తాలూకు ప్రోమో ఈ మధ్య విడుదల అయ్యింది. అది కాస్త వివాదానికి తెర లేపింది. ఆ చిత్రం ట్రైలర్ లో రామ్ తో పాటు కొన్ని  కుండలతో కొందరు ప్రముఖ నటుల షాట్స్, అలాగే వారి కుటుంబాల షాట్స్ చూపించారు.

“ధైర్యం బ్లడ్ లో ఉంటుంది. బాడీలో ఉంటుంది. ఫ్యామిలీలో ఉంటుంది. గుండెలో నుంచి వచ్చే దమ్ములో ఉంటుంది అని ఎదవ సొల్లు చెప్పటం నాకు ఇష్టం ఉండదు” అని రామ్ చెప్పిన డైలాగులతో విడుదల అయిన ఆ ట్రైలర్ దుమారం లేపింది. చలనచిత్ర రంగంలో కొందరు అగ్ర స్టార్లను తక్కువ చేసే విధంగా ఈ డైలాగులు ఉన్నాయని గొడవ మొదలైంది.  దానితో కొంత వివాదం రాజుకుంది. అయితే ఈ వివాదం మరింత పెద్దది కానివ్వకుండా రామ్ ట్వీట్ చేసారిట్లా…

“పండగ చేసుకో ట్రైలర్ లో డైలాగులు ఎవరినీ టార్గెట్ చేసుకుని చెప్పింది కావు. నా  పని నేను చూసుకు పోయే తీరు నాది తప్ప ఎవరినీ చిన్నచూపు చూడటం నా వంతు కాదు” అని ఆయన చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Send a Comment

Your email address will not be published.