తీసే సినిమాలు ఆడితేనేం ఆడకపోతేనేం … వరుసగా కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా సరే రామ్ గోపాల్ వర్మ ఆవేవీ పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం మూడు సినిమాలు తీయడంతో బిజీగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ.
ఇటీవలే ఐస్ క్రీం చిత్రం విడుదలై విఫలమైనా ఇప్పుడు ఐస్ క్రీం – 2 సినిమా చెయ్యడానికి ఆయన సంసిద్ధమయ్యారు. ఈ సినిమాలో నవీనా అనే కొత్త కథానాయికకు అవకాశం ఇవ్వడానికి రామ్ గోపాల్ వర్మ ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఒక పత్రికా ప్రకటన చేసారు…….
“నవీనా ఈజ్ కమింగ్ టు బర్న్ యు. షీ ఈజ్ హాటర్ దాన్ ఐస్ అండ్ కోల్డర్ దాన్ క్రీం ఇన్ ఐస్ క్రీం 2”