ఒక్కటైన నాగ చైతన్య, సమంతా

Samantha Nagaఎప్పుడెప్పుడా అనుకుంటున్న సమంత, నాగ చైతన్యలు ఒక్కటయ్యారు. వీరి వివాహం 2016 అక్టోబర్ ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల యాబై రెండు నిముషాలకు జరిగింది. ఈ పెళ్ళి పూర్తిగా హైందవ సంప్రదాయం ప్రకారమే జరిగింది. పెళ్ళికి ముందు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓ మూడు గంటలపాటు మెహందీ వేడుకలు జరిగాయి.

ఈ వివాహ వేడుకలో నాగ చైతన్య నాయనమ్మ డి రాజేశ్వరి చీరను సమంత ధరించడం విశేషం. అంతేకాదు, ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలను కూడా సమంత ధరించింది. మరోవైపు, నాగ చైతన్య సంప్రదాయ పద్ధతిలో ధోతీ ధరించారు. ఇక క్రైస్తవుల పద్ధతి ప్రకారం వీరి పెళ్ళి శనివారం సాయంత్రం జరిగింది.

నాగచైతన్య, సమంతలు ‘ఏ మాయ చేసావె’ చిత్రంతో పరస్పరం పరిచయమయ్యారు. ఆ తరువాత వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళి వరకు తీసుకుపోయింది. ‘ఆటోనగర్‌…’ చిత్రంతో మరింత దగ్గరయ్యారు. ఇద్దరూ తమ ఇష్టాలను, కష్టాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సంప్రదాయ పెళ్ళికన్నా ముందే వీరు ‘మనం’ చిత్రంలో ముందస్తుగా ఒకసారి పెళ్లి మంత్రాలు చదివించేసుకున్నారు.

ఇలా ఉండగా, వీరి పెళ్ళికి కొన్ని గంటల ముందే నాగచైతన్య తండ్రి, కథానాయకుడు అక్కినేని నాగార్జున తమ ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్‌ చేశారు. మరోవైపు, నాగచైతన్య ఒళ్లో కూర్చుని తీయించుకుని తీసుకున్న ఫొటోను సమంత మీడియాతో షేర్ చేసుకోవడం విశేషం.

ఇక ఈ పెళ్లికి హాజరైన ప్రముఖులు, వేడుకలోని ఫొటోలు కూడా పత్రికలలో ప్రచురించారు.

వేద మంత్రాల ఘోష నడుమ ఒక్కటైన నాగచైతన్య – సమంతా జంటను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని తెలుగుమల్లి దీవిస్తోంది.

Send a Comment

Your email address will not be published.