ఒక యాడ్ కి కోటిన్నర

నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అత్యంత  భారీ వేతనం పొందుతున్న  నటిగా అనిపించుకుంటున్నారు. ఇది అధికారికమైన  వార్తగా నలుగురి నోటా నానుతోంది.

ఆమె ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చేస్తోంది. ఒకటేమో జూనియర్  ఎన్ టీ ఆర్,  మరొకటి అల్లు అర్జున్  సరసన నటిస్తున్న నటి  రకుల్ ప్రీత్  సింగ్  కి ఒక  యాడ్  షూటింగ్ కి  రోజుకి ఇచ్చే పారితోషికం అక్షరాలా  కోటిన్నరగా వార్తలు షికార్లు  చేస్తున్నాయి.  తాజాగా  ఒక  నగల  దుకాణానికి (విశాఖపట్నం) ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఈ భారీ  మొత్తానికి  ఒప్పందం  చేసుకుంది.

టాలీవుడ్ వర్గాల్లో ఒక  నటి ఒక  యాడ్  కి  ఇంత  భారీ  సొమ్ము కి ఒప్పందం చేసుకోవడం ఇదే  మొదటిసారని అంటున్నారు. ఈ ఒప్పందం ఒకటిన్నర సంవత్సరానికిగాను ఆమె చేసుకున్నట్టు సన్ని  హిత  వర్గాల భోగట్టా…

ఇక్కడ ఓ విషయం చెప్పుకోవలసి ఉంది. ఆమె ఒక  సినిమాకు తీసుకునే సొమ్ము కన్నా ఈ  యాడ్  కి పుచ్చుకునే సొమ్ము ఎక్కువట.  సినిమాకి ఆమె  తీసుకునే డబ్బు  కోటి రూపాయలేనట

అయితే  యాడ్ కి ఆమెకు ముట్టే డబ్బు కోటిన్నర రూపాయలు కావడం విశేషం

Send a Comment

Your email address will not be published.